కావలి ప్రభుత్వ వైద్యశాలలో నూతన ఓ పి భవన నిర్మాణానికి ఎమ్మెల్యే శంకుస్ధాపన
కావలి, డిసెంబరు14, న్యూస్ మేట్ : కావలి ఏరియా వైద్యశాలలో 15 కోట్ల రూపాయల వ్యయంతో నూతన భవన నిర్మాణాలకు కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి సోమవారం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కావలి ఏరియా వైద్యశాలలో వసతులు సక్రమంగా లేవన్న విషయాన్ని ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఆయన వెంటనే స్పందించారన్నారు. నాబార్డు నిధుల కింద 15 కోట్ల రూపాయలను ముఖ్యమంత్రి మంజూరు చేశారన్నారు. ఈ నిధులతో రోగుల ఆభ్యున్నతిని దృష్టిలో పెట్టుకుని నూతన భవనాల్ని నిర్మిస్తామన్నారు. కార్పొరేట్వైద్యశాలలకు మించిన విధంగా కావలి ఏరియా వైద్యశాల వుండాలన్నదే తన ధ్యేయమన్నారు. రోగులకు సంబంధించి ఓపి భవనం అన్ని వసతులతో రూపు దిద్దుకుంటుందన్నారు. ఈ ఏరియా వైద్యశాలలో అంతర్గత రోడ్లు, ఇతర భవనాల మరమ్మతులు, కాంపౌండ్ వాల్నిర్మిస్తామన్నారు. కావలి ఏరియా వైద్యశాలను అత్యాధునిక వసతులతో రూపొందిస్తామన్నారు. రోగులకు అన్ని వసతులు కల్పిస్తామన్నారు. ఈ వైద్యశాల అభివృద్ధి కోసం ప్రభుత్వం నుంచి నిధులు తెచ్చేందుకు తాను వున్నానన్నారు. వైద్యులు, వైద్య సిబ్బంది అంకితభావంతో పనిచేసి తనకు, ప్రభుత్వానికి మంచి పేరు తేవాలన్నారు. కావలి ఏరియా వైద్యశాల బాగా అభివృద్ధి చెందితే చుట్టు ప్రక్కల ప్రాంతాలకు ఎంతో మేలుజరుగుతుందన్నారు.జాతీయ రహదారిపైన ఈ వైద్యశాల వుండటంతో సకాలంలో వైద్యం అందుకోవచ్చునన్నారు. కావలి నియోజకవర్గాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి పథం వైపు పయనించేలా అహర్నిశలు పాటుపడు తున్నా మన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ మండవ వెంకటేశ్వరరావు, ఆర్ ఏం ఓ డాక్టర్ ప్రసూన, ఆప్కాబ్ చైర్మన్ కొండూరు అనిల్ బాబు, ఏయంసి చైర్మన్ మన్నెమాల సుకుమార్ రెడ్డి, వైసిపి పట్టణ అధ్యక్షులు కేతిరెడ్డి శివకుమార్ రెడ్డి, ఐయంఎ మాజీ అధ్యక్షుడు డాక్టర్ శ్రీరాం మనోహర్ బాబు, డాక్టర్ సుబ్బారెడ్డి, వైసిపి నేతలు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి, కనమర్లపూడి వెంకట నారాయణ, అమరా వేదగిరి సుబ్బరాయుడు గుప్తా, నాయుడు రాంప్రసాద్, గంధం ప్రసన్నాంజనేయులు, జంపాని రాఘవులు, బీమా రంగారావు, కుందుర్తి శ్రీనివాసులు, షాహుల్ హమీద్, ఏరియా వైద్యశాల కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.