“అమరావతి రాజధాని పరిరక్షణ ప్రజా పాదయాత్ర”ను జయప్రదం చేయాలి

“అమరావతి రాజధాని పరిరక్షణ ప్రజా పాదయాత్ర”ను జయప్రదం చేయాలి

14/12/20

అమరావతి రాజధానిగా కొనసాగించాలని మూడువందల అరవై ఐదు రోజులుగా ఉద్యమం చేస్తున్న అమరావతి రైతుల ఉద్యమానికి సంఘీభావంగా ఈనెల 16న ఉదయం 10 గంటలకు ఒంగోలులోని కర్నూలు రోడ్డు ఫ్లయ్ ఓవర్ నుంచి అద్దంకి బస్టాండ్ మీదుగా కలెక్టర్ కార్యాలయం వరకు అమరావతి రాజధాని పరిరక్షణ కొరకు “అమరావతి రాజధాని పరిరక్షణ ప్రజా పాదయాత్ర” జరుగుతుందని, అనంతరం మానవహారంగా నిలబడి అమరావతి రైతులకు సంఘీభావం తెలపాలని తెలుగుదేశం పార్టీ ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షులు డాక్టర్ నూకసాని బాలాజీ అన్నారు. ఒంగోలు నగర తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో అమరావతి రైతులకు సంఘీభావంగా తలపెట్టిన కార్యక్రమానికి సంబంధించి జరిగిన సమావేశానికి ఒంగోలు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. అమరావతి రైతుల ఉద్యమం మహోన్నతమైనది, సంవత్సర కాలంగా వారు చేస్తున్న పోరాటం స్ఫూర్తిదాయకమని, అటువంటి రైతులకు సంఘీభావం తెలిపాల్సిన బాధ్యత రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరిపై ఉందని ఆయన అన్నారు.
అమరావతి రాజధాని పరిరక్షణ మహోద్యమ భాగస్వాములందరూ బుధవారం రోజు జరిగే కార్యక్రమానికి తప్పనిసరిగా హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు. ప్రభుత్వం కేసులు పెడుతుందని భయపడాల్సిన అవసరం లేదని, అమరావతి ఆంధ్రుల కలల రాజధాని అని, ఆ రాజధాని సాధించుకునేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, అందుకు అనవసరమైన పోరాటం సాగించాలని అని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పాల్గొనే ప్రతి ఒక్కరూ విధిగా కోవిడ్ వైరస్ వ్యాప్తి నివారణ నిబంధనలు పాటించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
కార్యక్రమంలో పాల్గొన్న వ్యక్తులు ప్రసంగిస్తూ అమరావతినే రాష్ట్ర ఏకైక రాజధానిగా ప్రకటించే వరకు పోరాటం కొనసాగుతుందని, దానికి తెలుగుదేశం పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ మంత్రి శ్రీనివాసరావు, మాజీ ఏఎంసీ చైర్మన్ కామేపల్లి శ్రీనివాసరావు, నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కటారి నాగేశ్వరరావు, అమరావతి పరిరక్షణ సమితి నాయకులు దిలీప్, మహిళా అధ్యక్షురాలు పసుపులేటి సునీత, రాష్ట్ర కార్యదర్శి కామరాజుగడ్డ కుసుమకుమారి, పార్టీ సీనియర్ నాయకులు ఎద్దు శశికాంత్ భూషణ్, గుర్రాల రాజ్ విమల్, పెళ్లురి చిన్న వెంకటేశ్వర్లు, సుబ్బారావ్, పద్మ, ప్రశాంతి, నండూరి చంద్ర, దాయినేని ధర్మ, బాసెమ్ శ్రీను, పళ్లపోతు వెంకటేశ్వర్లు, పాలపర్తి లక్ష్మీనారాయణ, కేసన శేషమ్మ, షేక్ హజీమున్నీసా, కొక్కిలిగడ్డ లక్ష్మి, కుంచాల శ్రీను తదితరులు పాల్గొన్నారు.

Spread the love
Ad Widget

Recommended For You

About the Author: Newsmate

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *