రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేసే వరకు పోరాటం ఆగదు రైతు సంఘం నేత కె వి వి ప్రసాద్

రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేసే వరకు పోరాటం ఆగదు రైతు సంఘం నేత కె వి వి ప్రసాద్

ఒంగోలు డిసెంబర్ 14 న్యూస్ మేట్ : 14/12/20నరేంద్ర మోడీ ప్రభుత్వం రైతులకు వ్యతిరేకంగా ప్రవేశపెట్టిన రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేసే వరకు పోరాటం కొనసాగుతుందని సిపిఐ అనుబంధ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె వి వి ప్రసాద్ అన్నారు .సోమవారం ఒంగోలు బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ ముందు రైతు సంఘాల ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. ధర్నాకి రైతు సంఘం నాయకులు పమిడి వెంకట్రావు అధ్యక్షత వహించారు .ఈ సందర్భంగా ప్రసాద్ మాట్లాడుతూ చలిలో వణుకుతూ ఢిల్లీలో రైతులు ఆందోళన చేస్తున్నా కన్నెత్తి చూడని నరేంద్ర మోడీ తీరుని ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. లక్షలాదిమంది రైతులు రోడ్డు మీదకు వచ్చి తమకు వ్యతిరేకంగా తయారైన చట్టాలను రద్దు చేయాలని భారత దేశ వ్యాప్తంగా ఆందోళన కొనసాగిస్తుంటే పెడచెవిన పెట్టడం నరేంద్ర మోడీ ప్రభుత్వానికే చెల్లిందని ఆయన దుయ్యబట్టారు. సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు వి శ్రీనివాసరావు మాట్లాడుతూ నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రజలపై ఆర్థిక భారం మోపడమే కాకుండా రైతుల నడ్డివిరిచే చట్టాలు తీసుకురావడం దుర్మార్గమని అన్నారు .భారతదేశంలో ఉన్న రైతాంగం ఈ చట్టాలను వ్యతిరేకిస్తుంటే లోక్ సత్తా పార్టీ నాయకులు జయప్రకాశ్ నారాయణ నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన పథకాలు అద్భుతంగా ఉన్నాయి అనటం రైతులను కించపరచటం కాదా అని ఆయన ప్రశ్నించారు.జయప్రకాశ్ నారాయణ కార్పొరేట్ శక్తుల పక్షమో రైతుల పక్షమో తేల్చుకోవాలని ఆయన హితవు పలికారు .రైతు వ్యతిరేక విధానాలను అనుసరిస్తున్న నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రజా విశ్వాసం కోల్పోయిన ట్లే రైతుల విశ్వాసం కూడా కోల్పోతున్నారని ఆయన విమర్శించారు .అనంతరం వైఎస్ఆర్ విగ్రహం వద్ద మానవహారం చేపట్టారు .ఈ కార్యక్రమంలో లో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎం ఎల్ నారాయణ సిపిఎం జిల్లా కార్యదర్శి పూనాటి ఆంజనేయులు రైతు నాయకులు చుండూరు రంగారావు సిపిఐ ఎమ్మెల్ నాయకులు చిట్టి పాట వెంకటేశ్వర్లు సిపిఐ నాయకులు ఎస్ డి సర్దార్ రైతు సంఘం నాయకులు కే హనుమారెడ్డి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్ వెంకట్ రావు మహిళా సంఘం నాయకులు విజయ రైతు సంఘం నాయకులు కె వీరారెడ్డి సిపిఎం నాయకులు కొండారెడ్డి కంకణాల ఆంజనేయులు మాబు ఇంకా సి.పి.ఐ ఎం.ఎల్ నాయకులు రైతు సంఘాల నాయకులు పాల్గొన్నారు.

Spread the love
Ad Widget

Recommended For You

About the Author: Newsmate

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *