అక్రిడిటేషన్ కమిటీలో జర్నలిస్టు సంఘాలకు ప్రాధాన్యత కల్పించాల్సిందే.. ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు ఐవీ సుబ్బారావు

అక్రిడిటేషన్ కమిటీలో జర్నలిస్టు సంఘాలకు ప్రాధాన్యత కల్పించాల్సిందే.. ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు ఐవీ సుబ్బారావు
ఒంగోలు డిసెంబర్ 14 న్యూస్ మేట్ : 14/12/20అక్రిడిటేషన్ కమిటీలో జర్నలిస్టు యూనియన్లకు ప్రాతినిధ్యం ఖచ్చితంగా కల్పించాలని ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు ఐవి సుబ్బారావు అన్నారు .ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర సమితి పిలుపు మేరకు కలెక్టర్ కార్యాలయం ముందు సోమవారం ధర్నా జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సుబ్బారావు మాట్లాడుతూ అక్రిడిటేషన్ కమిటీలో జర్నలిస్ట్ సంఘాలకు ప్రాతినిధ్యమే లేకుండా చేయటం అప్రజాస్వామికమని అన్నారు .జర్నలిస్టు సంఘాలకు ప్రాతినిధ్యం కల్పించే వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కొనసాగుతుందని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రాష్ట్రంలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలపై మంత్రులను కలిసి నా ప్రయోజనం ఉండటం లేదని ఆయన అన్నారు. జీవో నెంబర్ 123 తక్షణం రద్దు చేయాలని లేనియెడల ప్రెస్ కౌన్సిల్ కి ఫిర్యాదు చేస్తామని ఆయన తెలిపారు .అక్రిడిటేషన్ కమిటీ లో గుర్తింపు కలిగిన జర్నలిస్టు సంఘాలకు ప్రాధాన్యం కల్పించకపోతే హైకోర్టును ఆశ్రయిస్తామని న్యాయపోరాటం చేస్తామని ఆయన హెచ్చరించారు. ప్రభుత్వాలు జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించడంలో విఫలం అవుతుందనే తాము ఆందోళన చేపట్టాల్సి వస్తుందని ఆయన అన్నారు. రాష్ట్రంలో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల సమస్య సంవత్సరాల తరబడి పరిష్కారం కావడం లేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు .హెల్త్ స్కీమ్ పునరుద్ధరణకి ప్రతిసారి ఆందోళన చేపట్టాల్సి వస్తుందని ఆయన అన్నారు. కరోనా సోకి మృతి చెందిన జర్నలిస్టులకు ప్రభుత్వం ప్రకటించిన 5 లక్షల రూపాయలు వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. జర్నలిస్టులను కరోనా వారియర్స్ గా గుర్తించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు .ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే నాయకులు అలుగుల సురేష్ కోనూరు శ్రీనివాసరావు కనకయ్య గద్దల శివాజీ చిన్న పత్రికల యూనియన్ నాయకులు మన్నం మాధవరావు ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ నాయకులు ఇప్తేకర్ తదితరులు పాల్గొన్నారు.

Spread the love
Ad Widget

Recommended For You

About the Author: Newsmate

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *