రక్త దానం మహాదానం.. మాగుంట రాఘవరెడ్డి

14/12/20

రక్త దానం మహాదానం.. మాగుంట రాఘవరెడ్డి

కంభం డిసెంబర్ 14 న్యూస్ మేట్ :  రక్తదానం ద్వారా ఎదుటి వ్యక్తి ప్రాణాలను కాపాడవచ్చని ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి తనయుడు రాఘవరెడ్డి అన్నారు .కంభం మాజీ శాసనసభ్యులు స్వర్గీయ శ్రీ కందుల నాగార్జున రెడ్డి జయంతి సందర్భంగా కంభం చెరువు దగ్గర సోమవారం మాగుంట చారిటబుల్ ట్రస్ట్ మరియు కందుల గౌతమ్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్త దాన శిబిరాన్ని మాగుంట రాఘవ రెడ్డి ప్రారంభించారు .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంతోమంది ప్రభుత్వ ఆసుపత్రుల్లో రక్తం కోసం ఎదురు చూస్తున్న సందర్భాలు అనేకం ఉన్నాయని ఆయన గుర్తు చేశారు, ప్రభుత్వ ప్రైవేటు వైద్యశాలలో అత్యవసరంగా ప్రమాదకర పరిస్థితిలో ఉన్న వ్యక్తులకు రక్తం దానం చేయటం గొప్ప గుణం అని ఆయన అన్నారు . యువకులు విద్యార్థులు రక్తదానం చేయడం ద్వారా సమాజంలో ఎంతోమంది ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులను కాపాడ కలుగుతారని రాఘవ రెడ్డి అన్నారు .అన్ని దానాల కన్నా ఆపదలో ఉన్న వారికి రక్తదానం చేయడం మనకు లభించిన వరంగా భావించాలి అని ఆయన తెలిపారు. ప్రతి వ్యక్తి సంవత్సరానికి ఒక్కసారైనా రక్తదానం చేయాలని ఆయన కోరారు.

Spread the love
Ad Widget

Recommended For You

About the Author: Newsmate

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *