ఇరువర్గాల దాడి కేసులో 13 మంది అరెస్ట్

ఇరువర్గాల దాడి కేసులో 13 మంది అరెస్ట్

కావలి, డిసెంబర్ 14,న్యూస్ మేట్ 15/12/20: జలదంకి మండలం వేములపాడులో ఇరు వర్గాల ఘర్షణ ఘటనలో పోతల రమణయ్య తీవ్రంగా గాయపడిన నేపధ్యంలో నిందితులైన 13 మందిని సోమవారం చామదల క్రాస్ రోడ్డు వద్ద జలదంకి ఎస్సై వెంకట్రావు అరెస్టు చేసినట్లు డిఎస్పీ ప్రసాద్ తెలిపారు. బద్దిపూడి తిరుపాలు, చేవూరి నాగార్జున, చేవూరి సుబ్రహ్మణ్యం, కూసుపాటి ఏసేబు, మొద్దు అంజయ్య, మొద్దు జయరామయ్య, మొద్దు లక్ష్మయ్య, మొద్దు రామయ్య, మొద్దు రామకృష్ణ, మొద్దు రాంబాబు, పోతల రవిబాబు, పోతల శ్రీను, పోతల వెంకటేష్ అనే 13 మందిని సోమవారం కావలి పట్టణంలోని డిఎస్పీ కార్యాలయంలో మీడియా ముందు హాజరుపరిచారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డిఎస్పీ ప్రసాద్ మాట్లాడుతూ క్రింద పొలాలకు వెళ్లే దారి విషయంలో వేములపాడు గ్రామం అరుంధతి వాడ కు చెందిన మొద్దు రామకృష్ణ అభ్యంతరం చేసినందువలన, కక్షల వలన రామకృష్ణ అతని బంధు వర్గం ఒక వర్గముగా ఏర్పడి గొడవలు పడుతూ మొద్దు రామకృష్ణ వర్గం పోతల రమణయ్యను హత్య చేయాలని నిర్ణయించి అక్రమ సంఘంగా ఏర్పడి మారణాయుధాలను ధరించి డిసెంబర్ 10వ తేదీ సాయంత్రం పోతల రమణయ్య అతని బంధువులపై ఇనుపరాడ్లు, కర్రలు, రాళ్లతో దాడిచేసి రమణయ్య తలపై బలంగా ఇనుప రాడ్డుతో కొట్టినందున తీవ్ర గాయాలు అయినట్లు తెలిపారు. ఈ విషయమై ఇరువర్గాలు ఒకరిపై ఒకరు దాడి చేసుకోగా ఇరువర్గాల వారికి రక్త గాయాలు అయినవని, వారిలో పోతల రమణయ్య ప్రాణాపాయ స్థితిలో ఉండి మొదట నెల్లూరు, చెన్నై, తరువాత అక్కడి నుండి ప్రస్తుతం తిరుపతి సిమ్స్ వైద్యశాలలో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. ఈ విషయమై ఇరువర్గాల వారిపై జలదంకి పోలీస్ స్టేషన్ లో ఎస్సై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారన్నారు. పోతల రమణయ్య పై హత్యాయత్నం చేసి అతని బంధువులను కొట్టి గాయపరచిన ముద్దాయిలు తలదాచుకొనుటకు బయట ప్రాంతాలకు పారిపోతున్నారన్న సమాచారం మేరకు డిఎస్పీ, సిఐ ల పర్యవేక్షణలో ఎస్సై వెంకట్రావు తన సిబ్బందితో అరెస్టు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కావలి రూరల్ సిఐ అక్కేశ్వరరావు, జలదంకి ఎస్సై వెంకట్రావు, సిబ్బంది పాల్గొన్నారు.

Spread the love
Ad Widget

Recommended For You

About the Author: Newsmate

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *