కార్యదర్శి”కి పంచాయితీ ప్రజలు ప్రశంసలు

కార్యదర్శి”కి పంచాయితీ ప్రజలు ప్రశంసలు

కావలి, డిసెంబర్ 14 న్యూస్ మేట్ 14/12/20: కావలి మండలంలోని కొత్తపల్లి పంచాయితీలో సోమవారం కార్యదర్శి కత్తుల రాజేష్ పారిశుద్ధ్య పనులు చేపట్టారు.గ్రామంలోని సైడ్ కాలువలో నిలిచిన మట్టిని కార్మికుల చేత తీయించారు.డ్రెనేజ్ లో అపరిశుభ్రంగా నెలకొన్న చెత్త చెదరాలను శుభ్రం చేయించారు.గ్రామంలో తిరుగుతూ సమస్యపై ప్రజలను అరా తీస్తూ ప్రభుత్వ సంక్షేమపథకాల గురించి అవగాహన చేస్తూ చైతన్యం చేస్తున్నారు.జగనన్న ఆశయాన్ని ప్రజలకు వివరిస్తూ పల్లె అభివృద్ధికి బాటలు వేస్తున్నారు. నివర్ తుపాన్ ప్రభావం వలన ప్రజలు ఇబ్బందులు పడకుoడా ఎప్పటికప్పుడు ముందస్తుగా జాగ్రత్తలు చెప్తూ చర్యలుచేపట్టారు. తుపాను సమయంలో నిరంతరం పంచాయతీలో పర్యవేక్షణ చేస్తూ త్రాగునీరు,ప్రజలు కనీస అవసరాలకు ఉపయోగించే నీటిని అందిoచి పంచాయితీ ప్రజలు ఇబ్బందులు పడకుండా విధినిర్వహణ చేశారు. పంచాయతీలో స్తంభాలు నెలకొరిగి విద్యుత్ సరఫరా నిలిచిపోవటంతో ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి తక్షణం గ్రామానికి కరెంట్ సరఫరా చేయించి పంచాయితీ ప్రజలను నివర్ తుపాన్ ప్రభావం నుంచి కాపాడటంలో చిత్తశుద్ధితో విధినిర్వహణ చేశారు.నిరంతరం పర్యవేక్షణ చేస్తూ, ప్రజలు సమస్యలు తెలుసుకొని సమస్యలపరిష్కారానికికృషి చేస్తున్నారు.దీంతో పంచాయితీ ప్రజల మన్ననలు పొందుతున్నారు.మా పంచాయితీకి మంచి అధికారి వచ్చాడని ప్రజలు ఆనందం వ్యక్తంచేస్తున్నారు.

Spread the love
Ad Widget

Recommended For You

About the Author: Newsmate

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *