జ్వరాలు వాంతులు ఉదయగిరి లో పలువురికి అస్వస్థత

జ్వరాలు వాంతులు ఉదయగిరి లో పలువురికి అస్వస్థత
ఉదయగిరి డిసెంబర్ 15 (న్యూస్ మెట్) : నియోజకవర్గ కేంద్రమైన ఉదయగిరి లోని యాదవపాలెం వీధిలో జ్వరాలు వాంతులతో పలువురు అస్వస్థతకు లోనయ్యారు. ప్రస్తుత సీజన్లో జ్వరాలు రావటం సహజమే అయినప్పటికీ జ్వరంతోపాటు వాంతులు కూడా అధిక మోతాదులో అవుతుండడంతో ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. యాదవపాలెం, ఆవుల వీధి, వెటర్నరీ హాస్పిటల్ ప్రాంతాలలో సోమ, మంగళ వారాలలో పదుల సంఖ్యలో వృద్ధులు మహిళలు జ్వరాలు వాంతులతో బాధపడుతున్నారు. సంభందిత శాఖ అధికారులు స్పందించి ఈ విపత్కర పరిస్థితులకు కారణమేమిటో కనుగొని వైద్య సహ కారం అందించాల్సిందిగా ఆ ప్రాంత ప్రజలు కోరుతున్నారు.

Spread the love
Ad Widget

Recommended For You

About the Author: Newsmate

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *