కనిగిరి డిసెంబర్ 15 (న్యూస్ మేట్) : తన తండ్రి జ్ఞాపకార్థం క్రిస్మస్ సందర్భంగా సుమారు 200 మందికి తన సంపాదనతో పేదవారి ఆనందం కోసం వారికి సేవలను అందిస్తూ గత దశాబ్ద కాలం పైగా కనిగిరి ప్రాంతంలో అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్న సుధీర్ బాబు మరెంతో సహాయ సహకారాలు అందించాల్సిన అవసరం ఉందని కనిగిరి సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వరరావు పేర్కొన్నారు స్నేహ హస్తం వ్యవస్థాపకుడు సుధీర్ బాబు సెమీ క్రిస్మస్ పురస్కరించుకొని వారి తండ్రిగారైన కీర్తిశేషులు మోహన్ రావు జ్ఞాపకార్థం స్నేహ హస్తం ఆధ్వర్యంలో కనిగిరి పట్టణంలోని పాతూరు లో నిరుపేద వృద్ధులకు మంగళవారం దుప్పట్ల పంపిణీ చేశారు . ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర రావు మాట్లాడుతూ సంపాదనే ధ్యేయం కాకుండా తనకు వచ్చిన సంపాదనలో తన మిత్రమండలి తన యొక్క స్నేహా హస్తం సభ్యుల సహకారంతో నిరుపేద వృద్ధులకు చలికాలం దుప్పట్ల పంపిణీ చేయటం చాలా అభినందనీయం,సేవ చేస్తారు కానీ సేవ యొక్క ప్రతిఫలం పొందనటువంటి సంస్థ స్నేహహస్తం ఈ స్నేహ హస్తం చేసే ప్రతి మంచి కార్యక్రమం లో నన్ను భాగస్వామ్యం చేయడం నాకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది వీరు చేసే ప్రతి కార్యక్రమంలో కూడా నా వంతు భాగస్వామిని సహాయ సహకారాలు చేస్తానని హామీ ఇచ్చినారు,కనిగిరి ఎస్ ఐ రామిరెడ్డి మాట్లాడుతూ ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులు మిన్న అన్న మదర్ తెరిసా స్ఫూర్తిని తీసుకొని స్నేహ హస్తం అనేకమంది అభాగ్యులకు సహృదయంతోస్నేహ హస్తాన్ని అందిస్తూ మీరు చేస్తున్న సేవలు కొనియాడదగినది వీరు ఈ సభ్యులు ప్రతిరోజు నిరుపేదలకు అన్నదానం రక్తదానం చేయడం అభినందనీయమని మీరు ఇలాగే ముందుకు సాగుతూ ఈ ప్రాంతంలో మంచి సేవా కార్యక్రమాలు చేయాలని నేను ఆశిస్తున్నాను అన్నారు.హెల్ప్ ప్రతినిధి బి వి.సాగర్ మాట్లాడుతూ సుధీర్ బాబు తండ్రి గారైన కీర్తిశేషులు మోహన్ రావు జ్ఞాపకార్థం మరియు స్నేహ హస్తం సభ్యులు సమన్వయంతో వారి యొక్క ఆత్మ శాంతి కలిగించే విధంగా ప్రతి సంవత్సరం వారి పేరుమీద ఇటువంటి సేవా కార్యక్రమాలు చేయడం చాలా అభినందనీయమని కరోనా లాక్ డౌన్ సమయంలో కూడా అనేకమంది పేదల యొక్క ఆకలి వేదనను తీర్చిన అటువంటి ఈ స్నేహా హస్తం ఎప్పుడూ కూడా మంచి కార్యక్రమాలు చేస్తాయని ఈరోజు కీర్తిశేషులు మోహన్ రావు వారి కుమారుడైన సుధీర్ బాబు తన తండ్రి జ్ఞాపకార్థం ఇంత మంది పేదలకు ఉచితంగా దుప్పట్ల పంపిణీ చేయడం చాలా సంతోషకరమైన విషయం అన్నారు.కార్యక్రమంలో లివింగ్ హోప్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు జాన్ అత్తులూరి ,బేబీ రాజ్, అక్బర్ వలి, నరేంద్ర, కాసిం పీరా, భాస్కర్, మల్లికార్జున రావు, ఇమామ్ హుస్సేన్, జాకోబ్, హిమ వర్ధన్, కిషోర్ బాబు, మోహన్ కుమార్, ప్రేమ్ కుమార్, 6 వ సచివాలయం వాలంటీర్లు పాల్గొన్నారు.