ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రాణాలర్పించిన అమరజీవి పొట్టి శ్రీరాములు
కావలి, డిసెంబర్ 15,(న్యూస్ మేట్): కావలి పట్టణం లోని ట్రంక్ రోడ్ నందు శ్రీ పొట్టి శ్రీరాములు విగ్రహానికి కి కావలి శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మంగళవారం పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం నెల్లూరు జిల్లా వాసి పొట్టి శ్రీరాములు ఎన్నో పోరాటాలు చేసి ఆనాటి ఉమ్మడి మద్రాసు రాష్ట్రం ఉన్నటువంటి . ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం ఆయన ప్రాణ త్యాగం చేసిన ఆ మహనీయుడు ఎప్పుడు మన గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోతాడని అన్నారు. పొట్టిశ్రీరాములు తుది శ్వాస విడిచిన తర్వాత ఆనాటి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ప్రకటించడం జరిగిందని అన్నారు. ఆయన జన్మస్థలం అయిన బోగోలు మండలం జువ్వలదిన్నె లో ఫిషింగ్ హార్బర్ ఏర్పాటు చేయడం తొందరలో శంకుస్థాపన జరుగుతుందని అన్నారు.పొట్టిశ్రీరాములు జన్మస్థలం అయిన జువ్వాలదిన్నె గ్రామం ను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయడం జరుగుతుందని తెలిపారు. కావలి నడిబొడ్డున ట్రంక్ రోడ్ లో పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని అన్నారు. ఆ మహనీయుడు స్ఫూర్తితో పార్టీలకు అతీతంగా అభివృద్ధి బాటలో నడిపిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ మన్నెమాల సుకుమార్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు కేతిరెడ్డి శివ కుమార్ రెడ్డి, వైయస్సార్ రాష్ట్ర సేవాదళ్ నాయకులు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి , అమర వేదగిరి గుప్తా , తిరువీధి ప్రసాద్, కనమర్లపూడి నారాయణ, గ్రంథం ప్రసన్న ఆంజనేయులు , పెనుమల్లి అశోక్ , వల్లెపు కిషోర్, గుర్రం వెంకటేశ్వర్లు, దర్శి గుంట మహేంద్ర వడ్లమూడి వెంకటేశ్వర్లు, పరుసు మాల్యాద్రి, తదితరులు పాల్గొన్నారు.