వ్యవసాయ బిల్లుల రద్దు కోరుతూ కొవ్వొత్తుల ప్రదర్శన

వ్యవసాయ బిల్లుల రద్దు కోరుతూ కొవ్వొత్తుల ప్రదర్శన
పొన్నలూరు డిసెంబర్ 15 న్యూస్ మేట్ :  కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన 3 వ్యవసాయ బిల్లులను, విద్యుత్ చట్టాన్ని రద్దు చేయాలని కోరుతూ గత 20 రోజులుగా దేశ రాజధాని ఢిల్లీ నగరంలో రైతుల చేస్తున్న దీక్షలకు గ్రామగ్రామాన మద్దతు తెలపాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర సమితి సభ్యులు కే వీరారెడ్డి కోరారు. మంగళవారం పొన్నలూరు మండలం చవటపాలెం గ్రామంలో రైతుల దీక్షకు మద్దతుగా కొవ్వొత్తుల ప్రదర్శన జరిగింది. ఈ సందర్భంగా వీరారెడ్డి మాట్లాడుతూ దేశ ప్రజలకు నష్టం చేసేటటువంటి వ్యవసాయ చట్టాలు, 2020 విద్యుత్తు చట్టాన్ని రద్దు చేయకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తారని కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేశారు. స్వామినాథన్ కమిటీ సిఫారసులను అమలు చేసి రైతులకు మద్దతు ధర లభించే విధంగా చట్టం చేయాలని కోరారు. అంబానీ , అదానీ లకు మేలు చేసే కేంద్ర విద్యుత్ చట్టాన్ని రద్దు చేయాలని కోరారు.19 నుంచి రైతు సంఘ నాయకులు ఢిల్లీలో నిరవధిక నిరాహార దీక్ష కి పూనుకుంటున్నారని వారికి మద్దతుగా మండల కేంద్రాలలో 21వ తేదీన జరుగు నిరసన కార్యక్రమాలలో ప్రజలు పెద్దఎత్తున పాల్గొనాలని వీరారెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు కాట్రగడ్డ నర్సింగరావు, ప్రసాదు, మాలకొండయ్య , మాధవ్, నర్సింగ్ రావు తదితరులు పాల్గొన్నారు.

Spread the love
Ad Widget

Recommended For You

About the Author: Newsmate

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *