జాతీయ రహదారి భూ సేకరణకు సహకరించండి
వలేటివారిపాలెం డిసెంబర్ 17 న్యూస్ మేట్ :- మండలంలో 167బి జాతీయ రహదారి ఏర్పాటులో భాగంగా భూసేకరణకు రైతులు సహకరించాలని తహశీల్దార్ ముజఫర్ రెహ్మాన్ రైతులను కోరారు. గురువారం మండలంలోని చుండి,అయ్యవారిపల్లి గ్రామాలలో ఆయన గ్రామ సభను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ రహదారి లో వ్యవసాయ భూమిని కోల్పోయే రైతులు భూ యాజమాన్య హక్కు పత్రాలను రెవెన్యూ అధికారులకు చూపించి తగిన పరిహారం పొందవచ్చునని అన్నారు. పలు రైతుల నుంచి భూ హక్కు పత్రాలను తీసుకొని రెవెన్యూ రికార్డులో సరి చూశారు. ఈ కార్యక్రమంలో వీఆర్వో రామకృష్ణ, వీఆర్ఏ సుజాత, రైతులు, తదితరులు పాల్గొన్నారు.