రెవిన్యూ సమస్యల పరిస్కారానికి కృషి
దుత్తలూరు డిసెంబర్ 17 న్యూస్ మేట్:- మండలంలోని రెవిన్యూ సమస్యల పరిస్కారానికి కృషి చేస్తానని తహశీల్దారు చంద్రశేఖర్ తెలిపారు .ఆయన మీ భూమి మా హామీ పై గ్రామసభను నందిపాడు గ్రామంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూ సమస్యలు తలెత్తకుండా రీ సర్వే చేపట్టేందుకు మండలంలో రైతులకు అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. జనవరి 1 నుండి జులై 24 వరకు గ్రామ సభలో నిర్వహిస్తామన్నారు. భూ సమస్యలపై రైతులు సతమతమవుతున్న సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం భవిష్యత్తులో ఎలాంటి భూ సమస్యలు తలెత్తకుండా భూ సర్వే నిర్వహించడం జరుగుతుందన్నారు. బయట ప్రాంతాల్లో ఉన్న రైతులు భూ సర్వే లో పాల్గొని సర్వేకు సహకరించాలన్నారు. సర్వే నిర్వహించి హద్దులు చూపటంతో పాటు హద్దులు దాటి భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చేయడమే ప్రభుత్వ లక్ష్యం అన్నారు. డ్రోన్ కెమెరాలు సైతం ఉపయోగించి సర్వే నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ గ్రామ సభలో భూ సమస్య ఏదైనా ఉంటే తెలియజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సర్వేయర్ మోహన్ ,విఆర్వో ప్రశాంతి ,రెవిన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు .