సీడ్స్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం
దుత్తలూరు డిసెంబర్ 17 న్యూస్ మేట్ :- దుత్తలూరు సీడ్స్ స్వచ్ఛంద సంస్థ , పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో బ్రహ్మేశ్వరం గ్రామ పంచాయతీలో ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కమ్మవారిపాలెం P.A.C.S మరియు D.C.M.S చైర్మన్ చేజర్ల .చలమారెడ్డి పాల్గొని మాట్లాడుతూ సీడ్స్ సంస్థ , పశుసంవర్ధక శాఖ ఇలాంటి మంచి కార్యక్రమం ఏర్పాటు చేసి పశువులకు వచ్చే వ్యాధుల గురించి, వాటి నివారణ గురించి ప్రజలలో అవగాహన తెలియజేసినందుకు వారిని అభినందించారు. మండల పశు వైద్య సిబ్బందిని, సీడ్స్ సంస్థ వారికి బ్రహ్మేశ్వరం గ్రామ ప్రజలు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమానికి ప్రాంతీయ పశు వైద్యశాల దుత్తలూరు అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ వెంకట సుబ్బయ్య సీడ్స్ స్టేట్ హెడ్ పురుషోత్తం, డైరీ ప్రొఫెసర్ మలికార్జున రెడ్డి, బ్రహ్మేశ్వరం వైయస్సార్ పార్టీ నాయకులు సూరే.రమణారెడ్డి , కరాది. వెంకటేశ్వర రెడ్డి , వల్లూరి. వెంకట రెడ్డి,మీసాల సుబ్బరాయుడు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.