అమరావతి రాజధాని రైతుల దీక్షకు మద్దతుగా టిడిపి నిరసన

అమరావతి రాజధాని రైతుల దీక్షకు మద్దతుగా టిడిపి నిరసన

కనిగిరి డిసెంబర్ 17 (న్యూస్ మేట్) : 17/12/20అమరావతి రాజధాని కోసం భూములిచ్చిన రైతులు కుటుంబాలతో సహా రోడ్డెక్కి చేస్తున్న ఉద్యమం 365 రోజులు పూర్తి అయిన సందర్భంగా గురువారం కనిగిరిలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు నిరసన ప్రదర్శన చేపట్టారు. తెలుగుదేశంపార్టీ పిలుపు మేరకు ఇన్చార్జ్, మాజీ ఎమ్మెల్యే Dr ముక్కు ఉగ్రనరసింహారెడ్డి ఆదేశాల మేరకు పార్టీ క్యాంపు కార్యాలయం నుంచి ప్లకార్డులు చేతపట్టి పట్టణంలో ర్యాలీ చేపట్టిన అనంతరం చర్చి సెంటర్లో మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మాట్లాడుతూ నాడు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్న ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ నిండుసభలో రాజధాని అమరావతికి మద్దతు తెలిపి నేడు 3 రాజధానులను తెరమీదకు తీసుకువచ్చి మాట తప్పిమడమ తిప్పారు అని దుయ్యబట్టారు. రైతులు రోడ్డెక్కి 365 రోజులుగా రోడ్డు ఎక్కి పోరాడుతున్నా ముఖ్యమంత్రి మనస్సు కరగకపోవడం దురదృష్టకరం అని అన్నారు.మనసు మార్చుకుని ఒకే రాజధానిగా కొనసాగించాలని లేకపోతే ప్రజలు క్షమించరని పేర్కొన్నారు.అన్ని అనుమతులతో రాజధాని రైతులు చేస్తున్న జనభేరి కార్యక్రమానికి వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడం దారుణం అని వారు అన్నారు.ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు VVR మనోహరరావు, రాచమల్ల శ్రీనివాసరెడ్డి, దొడ్డా వెంకట సుబ్బారెడ్డి, తమ్మినేని శ్రీనివాసులు రెడ్డి,ఫిరోజ్ తమ్మినేని వెంకటరెడ్డి, ముత్తిరెడ్డి వెంకట రెడ్డి, యస్.టి.ఆర్, కందుల సుబ్బారెడ్డి, బుల్లా బాలబాబు, షేక్ జంషీర్ అహ్మద్,బారా ఇమాం , బ్రమ్మ రెడ్డి, చింతలపూడి తిరుపాలు, అచ్చాల రవి, అంజి, షడ్రక్, హాజరత్ , మధు, కొల్లూరి శ్రీను, బ్రమ్మం గౌడ్, చెన్నయ్య, చిన మస్తాన్, సురేష్ , కొండలు, జిలాని ,అన్నా,చిలకపాటి బ్రమ్మం, షారుక్ , బాబు, సత్తి, తదితరులు పాల్గొన్నారు.

Spread the love
Ad Widget

Recommended For You

About the Author: Newsmate

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *