ఢిల్లీలో రైతు దీక్షకు మద్దతుగా కిసాన్ జ్యోతి

ఢిల్లీలో రైతు దీక్షకు మద్దతుగా కిసాన్ జ్యోతి
కనిగిరి డిసెంబర్ 17 (న్యూస్ మేట్) : 17/12/20కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన మూడు వ్యవసాయ చట్టాలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ గత 15 రోజుల నుంచి ఢిల్లీ నగరo లో రైతులు చేస్తున్న నిరసన కార్యక్రమానికి మద్దతు తెలుపుతూ కనిగిరి లో భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ,ఆంధ్ర ప్రదేశ్ రైతు సంఘం కనిగిరి నియోజకవర్గ సమితి ఆధ్వర్యంలో గురువారం కిసాన్ జ్యోతి ర్యాలీ నిర్వహించడం జరిగింది. స్థానిక గార్ల పేట బస్ స్టాండ్ నుంచి సుగుణవతి సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా రైతు సంఘం నాయకులు గుజ్జుల బాల్రెడ్డి,సిపిఐ కనిగిరి నియోజకవర్గ సహాయ కార్యదర్శి సయ్యద్ యాసీన్ మాట్లాడుతూ రైతులు పండించిన పంట ఉత్పత్తులను కార్పొరేట్ సంస్థలకు ధారాదత్తం చేయడానికి కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ చట్టాలను పార్లమెంటులో మోడీ ప్రభుత్వం ఆమోదించిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ చట్టాలతో రైతులు కూలీలుగా మారే అవకాశం ఉందన్నారు. పట్టెడన్నం పండించే రైతుకు ఈ చట్టాల వల్ల ఎటువంటి భరోసా కలగదని వెంటనే ఆ చట్టాలను రద్దు చేసి రైతులను కాపాడాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో రైతు సంఘం నాయకులు జిపి రామారావు,ఏఐటీయూసీ నాయకులు షేక్ మహబూబ్ పీరా పాల్గొని మోడీ అనుసరిస్తున్న ప్రజా రైతు వ్యతిరేక విధానాలను ఎండగట్టారు. భారతదేశం అంతా నిరసన వెల్ల్వెత్తుతుంద ని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాలు , కార్మిక ,కర్షక ,ఉద్యోగ, యువజన, విద్యార్థి ,మహిళా సంఘాలు, కిసాన్ జ్యోతి కార్యక్రమాన్ని మద్దతు తెలిపాయి. ఈ కార్యక్రమంలో సిపిఐ పట్టణ కార్యదర్శి జిలాని, షరీఫ్ ,దళిత హక్కుల పోరాట సమితి జిల్లా ఉపాధ్యక్షులు మోహన్, పొట్ట సుబ్బారావు, అంజి ,రమణయ్య, శీను ,మాల్యాద్రి ,సయ్యద్ ఖాదర్ మస్తాన్ ,ఎస్ డి మౌలాలి పాల్గొన్నారు. రైట్ అప్ వ్యవసాయ చట్టాలకు రద్దు చేయాలని కిసాన్ జ్యోతి నీ నిర్వహిస్తున్న రైతు సంఘం నాయకులు

Spread the love
Ad Widget

Recommended For You

About the Author: Newsmate

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *