టిడ్కో లబ్ధిదారులు ఎవరు అపోహ పడవద్దు -మునిసిపల్ కమిషనర్ డి వి ఎస్ నారాయణ రావు
కనిగిరి డిసెంబర్ 17 (న్యూస్ మేట్) : టిడ్కో లబ్ధిదారులు ఎవరు అపోహ పడవద్దని మునిసిపల్ కమిషనర్ డి వి ఎస్ నారాయణ రావు అన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ జి ప్లస్ త్రీ లబ్ధిదారులు ఎవరు కూడా ఆందోళన చెందవలసిన అవసరం లేదని రిజిస్ట్రేషన్ కోసం ఇద్దరు సాక్షులు సంతకం అవసరమే కానీ దానికోసం ఎవరూ అపోహ పడవద్దని మీకు ఎవరు సహకరించకపోయినా తోటి లబ్ధిదారుడి సహాయంతో రిజిస్ట్రేషన్ చేయబడుతుందని తెలియజేశారు . ఎవరు కూడా భయాందోళనకు గురి కావద్దని అనుమానాలు ఉంటే మున్సిపల్ ఆఫీస్ కి వచ్చి నివృత్తి చేసుకోవాలని ఆయన అన్నారు.