అక్రమంగా మట్టి తరలిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఎస్ఐ రామిరెడ్డి కి పిర్యాదు చేసిన ఇరిగేషన్ డీఈ సీతారామయ్య

అక్రమంగా మట్టి తరలిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఎస్ఐ రామిరెడ్డి కి పిర్యాదు చేసిన ఇరిగేషన్ డీఈ సీతారామయ్య

కనిగిరి డిసెంబర్ 17 (న్యూస్ మేట్) : 17/12/20స్థానిక పెద్ద చెరువు నుండి అక్రమంగా మట్టి తరలిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఎస్ఐ రామిరెడ్డి కి ఇరిగేషన్ డీఈ సీతారామయ్య గురువారం ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెద్ద చెరువు నుండి రాత్రి సమయంలో జెసిబి లతో ట్రాక్టర్ల ద్వారా కొందరు వ్యక్తులు చెరువు నుండి అక్రమంగా మట్టిని తరలిస్తున్నారని అదేవిధంగా హెచ్చరిక బోర్డులు తీసివేసి అక్రమ తరలింపు చేస్తున్నారని అట్టి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు.మట్టిని తరలిస్తున్న వాహనాలను పట్టుకుని చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్థానిక పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరిగిందని ఆయన అన్నారు .ఎస్ఐ రామిరెడ్డి మాట్లాడుతూ పెద్ద చెరువు నుండి అక్రమ మట్టి తరలింపు చేస్తున్నారని ఇరిగేషన్ శాఖ నుండి ఫిర్యాదు అందిందని ఫిర్యాదు పైన దృష్టి సారించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలియజేశారు .

Spread the love
Ad Widget

Recommended For You

About the Author: Newsmate

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *