టి ఎన్ ఎస్ ఎఫ్ ఒంగోలు పార్లమెంట్ రవితేజ

టి ఎన్ ఎస్ ఎఫ్ ఒంగోలు పార్లమెంట్ రవితేజ
ఒంగోలు డిసెంబర్ 17 న్యూస్ మేట్ :  17/12/20ఒంగోలు పార్లమెంట్ టిఎన్ఎస్ఎఫ్ అధ్యక్షుడు గా నియమించబడిన తిప్పరమల్లి రవితేజను ఒంగోలు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు డాక్టర్ నూకసాని బాలాజీ అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒంగోలు పార్లమెంట్ పరిధిలో తెలుగుదేశం పార్టీ బలోపేతానికి కృషి చేయాలని మరి ముఖ్యంగా ఎక్కువ మంది విద్యార్థులను టీడీపీ వైపు ఆకర్షించేవిధంగా పని చేయమని ఆకాక్షించారు. పార్టీ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని, పార్లమెంట్ పరిధిలో పార్టీ పటిష్టతకు కృషి చేస్తానని, తనకు ఈ అవకాశం కల్పించిన రాష్ట్ర టి.ఎన్.ఎస్.ఎఫ్ అధ్యక్షులు ప్రణవ్ గోపాల్ కి, రాష్ట్ర ఉపాధ్యక్షులు మరియు యు ఒంగోలు నియోజక ఇన్ చార్జ్ దామచర్ల జనార్ధన్ కి, ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షులు నూకసాని బాలాజి కి ప్రతేకంగా ధన్యవాదలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏ.ఏం.సి మాజీ ఛైర్మన్ కామేపల్లి శ్రీనివాసరావు, ఒంగోలు నగర అధ్యక్షులు కటారి నాగేశ్వరరావు, సేనియర్ నాయకులు నామ వెంకటేశ్వర్లు, పాతూరి పుల్లయ్య చౌదరి, గుర్రాల రాజ్ విమల్, పొనుగుపాటి వెంకటేశ్వర్లు, చల్లా హరి, బండారు మధన్, కె.శ్రీనివాసరావు, టి.ఎన్.ఎస్.ఎఫ్ విధ్యార్ధులు యశ్వంత్ కుమార్, లీలా సాయి ప్రవీణ్, రేవంత్ కృష్ణ, సుధీర్, శివకృష్ణ, వినయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Spread the love
Ad Widget

Recommended For You

About the Author: Newsmate

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *