ఘనంగా జరిగిన పెన్షనర్స్ డే
కంభం డిసెంబర్ 17 న్యూస్ మేట్ : కంభం విశ్రాంత ఉద్యోగుల సంఘం భవనం లో పెన్షనర్స్ డే ను గురువారం ఘనంగా నిర్వహించినట్లు ఆ సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఆవుల సుబ్బారెడ్డి, షేక్ మహమ్మద్ ఇబ్రహీం ఒక సంయుక్త ప్రకటనలో తెలిపారు. సమావేశం తదనంతరము కంభం సబ్ ట్రెజరీ అధికారి శ్రీ కె.వి రవికుమార్ కార్యదర్శి షేక్ మహమ్మద్ ఇబ్రహీం సీనియర్ ఉపాధ్యాయు లైన కే సత్యనారాయణ స్వామి, ప్రధానోపాధ్యాయురాలు ఎల్ సుజాతమ్మ, విక్టోరియా మహారాణి , షేక్ మహబూబ్ తీరా,, ఎం చంద్రశేఖర్ ఆంజనేయ రెడ్డి, పిసుధాకర్ రెడ్డి కె.వి రంగయ్యతదితరులను ఘనంగా సన్మానించారు. రిటైర్డ్ అయిన ఉద్యోగుల సేవలను గోవిందయ్య, బి నాయుడు రిటైర్డ్ ఎస్సై సిలార్, అసోసియేట్ అధ్యక్షులు కె జె భాస్కర్, వీ రాజులయ్య తదితరులు ప్రసంగించారు. ఈ సమావేశానికి ఆవుల సుబ్బారెడ్డి అధ్యక్ష వహించారు. కార్యదర్శి ఇబ్రహీం, రిపోర్ట్ జమా ఖర్చుల వివరాలు ప్రవేశపెట్టారు.