మాదకద్రవ్యాలు హానికరం
మార్కాపురం డిసెంబర్ 17 న్యూస్ మేట్ : మారక ద్రవ్యాలు మనిషి జీవితాన్ని నాశనం చేస్తాయని మార్కాపురం మండలం రాయవరం రూరల్ పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసులు అన్నారు. ప్రకాశం జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ ఆదేశాల మేరకు గురువారం రాయవరం గ్రామంలో మారక ద్రవ్యాల పై ప్రజలకు అవగాహన సదస్సు నిర్వహించారు .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మారక ద్రవ్యాలు అలవాటు పడితే యువత భవిష్యత్తు అందకారంగా మారుతుందని అన్నారు. మారక ద్రవ్యాల కు దూరంగా ఉన్న కుటుంబాలు సుఖ సంతోషాలతో ఉంటాయని ఆయన చెప్పారు .మారక ద్రవ్యాలు వాడొద్దని ప్రజలకు ఆయన హితవు చెప్పారు