మహిళా మార్చ్ కు 100 రోజులు

మహిళా మార్చ్ కు 100 రోజులు

కందుకూరు డిసెంబర్ 18 న్యూస్ మేట్:- 18/12/20మహిళ మార్చ్ ప్రారంభమై నేటికి 100 రోజులకు చేరుకున్న సందర్భంగా శుక్రవారం మండలం లోని పలుకూరు గ్రామంలోని హైస్కూల్ లో మహిళ మార్చ్100 రోజుల కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సచివాలయం మహిళ పోలీస్ మానస పాల్గొని మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో గుర్తింపు పొందుతున్నాసమాజం లో ప్రతిరోజూ ఎదో ఒకచోట అడవారి మీద అత్యాచారాలు ,దాడులు జరుగుతూనే ఉన్నాయని అన్నారు. మహిళల రక్షణకు ప్రభుత్వం ఎన్ని రకాల చర్యలు తీసుకుంటున్న మహిళలపై అత్యాచారాలు ఆగడం లేదని అన్నారు. దిశ లాంటి కటినమైన చట్టాలను పటిష్టంగా అమలు చేస్తే గాని ఇలాంటి దాడులు అరికట్టవచ్చు అని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులకు దిశ యాప్ ను మొబైల్ లో ఏ విధంగా ఇన్ స్టాల్ చేసుకోవాలో విద్యార్థులకు వివరించారు. ఆపద సమయంలో ఎలా ఉపయోగించాలో ఏ నెంబర్లకు కాల్ చేస్తే పోలీసులు త్వరగా స్పందిస్తారో వివరించారు. ఎలాంటి సందేహాలు అనుమానాలు ఉన్నా ఈ నెంబర్లకు ఫోన్ చేసి పరిష్కారం పొందవచ్చని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు జాన్ ఎం, ఉపాధ్యాయులు సుబ్బారావు, సిండ్రెల్లా, విజయ కుమారి, మరియు అంగన్వాడి టీచర్లు , వాలంటీర్లు, తదితరులు పాల్గొన్నారు.

Spread the love
Ad Widget

Recommended For You

About the Author: Newsmate

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *