మృతుని కుటుంబానికి కోటి రూపాయల నష్టపరిహారం చెల్లించాలి టిడిపి

మృతుని కుటుంబానికి కోటి రూపాయల నష్టపరిహారం చెల్లించాలి టిడిపి18/12/20

మార్కాపురం డిశంబరు 18 న్యూస్ మేట్ :బిసి సంక్రాంతి సభకు వెళ్లి వస్తూ మృతి చెందిన బ్రహ్మయ్య మృతదేహాన్ని తెలుగుదేశం పార్టీ ఒంగోలు పార్లమెంటు అధ్యక్షులు బాలాజీ మార్కాపురం మాజీ శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి శుక్రవారం పరామర్శించారు మృతుని తండ్రి ఆంజనేయులు మాట్లాడుతూ తన కొడుకు వాలంటీర్ గా పనిచేస్తాడని నిన్న మీటింగ్ లో ఏం జరిగిందో తమకు తెలియట్లేదు అని అన్నారు. అస్వస్థతకు గురైన తన కొడుకుని హాస్పిటల్ కి తీసుకెల్లెలోపే చనిపోయాడని చెప్తూ కన్నీరు పెట్టుకున్నారు. మిగిలిన ఇద్దరు వ్యక్తులు కూడా కొద్దిపాటి అస్వస్థతకు గురయ్యారని చికిత్స అనంతరం తిరిగొచ్చారు అని పక్కనే ఉన్న గ్రామస్థులు చెప్పారు.బాలాజీ మాట్లాడుతూ పోస్టుమార్టం రిపోర్టు ద్వారానే ఇది ఫుడ్ పాయిజన్ అవ్వడం వల్ల లేక గుండెపోటు వల్ల అనేది తేలుతుందని గుంటూరు ఎన్ఆర్ఐ ఆసుపత్రి నుంచి పంపేటపుడే పోస్టుమార్టం చేసి పంపాలని అలా చేయకుండా ఎలా పంపుతారని ప్రశ్నించారు. పోస్టుమార్టం వెంటనే నిర్వహించాలని డిమాండ్ చేశారు.పోస్టుమార్టం నిర్వహించకుండా ఇది సాధారణంగా సంభవించిన మరణం అంటే ఎలా నమ్మేదనీ, అది గుండె జబ్బు అయితే మిగతా ఇద్దరు కూడా అస్వస్థతకు గురైన మాట వాస్తవం కాదా.. వారు చికిత్స పొందటం నిజం కాదా అని ఆయన ప్రశ్నించారు.ఈ మరణానికి ప్రభుత్వం బాధ్యత వహించి పార్టీలతో, రాజకీయాలతో సంబంధం లేకుంటే ఆ కుటుంబాన్ని వెంటనే ఆదుకోవాలనీ ఆ కుటుంబానికి కోటి రూపాయలు నష్ట పరిహారంగా అందించాలనీ డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఇటువంటివి జరిగినపుడు ప్రజలకు అండగా ఉండాలనీ ఇప్పుడు ఆ కుటుంబం పరిస్థితి ఏంటని నిలదీస్తూ ప్రభుత్వానికి ఏమాత్రం స్పష్టత, చిత్తశుద్ది ఉన్న ఆ కుటుంబానికి వెంటనే నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలి అన్నారు.అసలు పోస్టుమార్టం నిర్వహించకుండా అప్పటికప్పుడు మృతదేహాన్ని మార్కాపురం తీసుకురావలసిన అవసరం ఏమొచ్చిందన్నారు. ముందు వెళ్ళి చూపించినటువంటి హాస్పిటల్ కేస్ షీట్ ఏది చూపించండి. దాన్ని ఎవరు మాయం చేశారు అని ప్రశ్నించారు.పేద ప్రజలతో ఆటలాడాలని చూస్తున్నారా! ప్రభుత్వం అంటే మసి పూసి మారేడు కాయ చేయడమా.. మీ మీటింగ్ కి మీ మీద నమ్మకంతో వచ్చారు.. కాబట్టి వెంటనే ఈ విషయంపై దర్యాప్తు జరపి ఇది ఫుడ్ పాయిజన్ అవునా కాదా అనేది తేల్చాలి అని ఆయన ఉందన్నారు. బ్రహ్మయ్య తండ్రి ఆంజనేయులును వెంటనే ఆదుకుని ఈ కేసుపై సమగ్రమైన విచారణ జరిపి నిజానిజాలు తేల్చాలి.కందుల నారాయణ రెడ్డి మాట్లాడుతూ నిన్న మీటింగ్ కి వెళ్ళిన వాళ్ళందరూ టెస్టు చేయించుకోవాలని, 3 రోజుల తర్వాత కూడా ఈ సమస్య తాలూకు లక్షణాలు బయటపడే అవకాశం ఉందనీ అందరూ జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. బ్రహ్మయ్య కుటుంబానికి న్యాయం జరిగే వరకు అన్నివిధాల అండగా ఉంటామని బ్రహ్మయ్య తండ్రి ఆంజనేయులుకు దైర్యం చెప్పారు.

Spread the love
Ad Widget

Recommended For You

About the Author: Newsmate

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *