భయం వీడండి జాగ్రత్తలతో కరోనా ని గెలవండి
కనిగిరి డిసెంబర్ 18 (న్యూస్ మేట్) : కనిగిరి నగర పంచాయతీ ఏడవ సచివాలయ పరిధిలో కరోనా వైరస్ నియంత్రణపై రాష్ట్ర ప్రభుత్వం పిలుపు మేరకు నగర పంచాయతీ కమిషనర్ ఆదేశానుసారం శుక్రవారం అవగాహన ర్యాలీ జరిగింది. సచివాలయం ఏ ఎన్ ఎం లక్ష్మి మాట్లాడుతూవైరస్ మహమ్మారి తొలి దశ కొనసాగుతుండగానే.. మళ్లీ కొన్ని ప్రాంతాల్లో రెండో దశ కరోనా విజృంభించనుందని మళ్లీ కరోనా కేసులు విస్తృత స్థాయిలో విజృంభించే అవకాశాలు కనిపిస్తున్నాయని చెప్పారు. వాస్తవానికి వైరస్ అనేది ఎప్పుడైనా ఆకస్మాత్తుగా రూపాంతరం చెందగలదు. వ్యాధి తీవ్రత తగ్గిపోయిందని నొక్కి చెప్పలేమన్నారు. తగ్గినట్టే తగ్గిన వైరస్ మళ్లీ హఠాత్తుగా రెండో తరంగంలా ఎగసి పడొచ్చునని హెచ్చరించారు. అందరూ బయటకు వేల్లేటప్పుడు మాస్కులు ధరించాలని భౌతిక దూరం పాటించాలని చేతులు శుభ్ర పరుచుకోవాలని అన్నారు.త్వరలో వ్యాక్సీన్ వస్తుందని అందరూ సంసిద్ధంగా ఉండాలని తెలిపారు. అనంతరం దేవంగనగర్ ,కాశి రెడ్డి నగర్ నందు కరోనా వైరస్ నియంత్రణ పై ర్యాలీ నిర్వహించారు . ఈకార్యక్రమంలో 7వ సచివాలయం అడ్మిన్ సునిల్ కుమార్ , VRO భూదేవి , మల్లిఖార్జున, వాసు బాబు, అఖిబు ,ఆశా వర్కర్లు ,ఆర్ పి లు ,వాలంటీర్స్ తదితరులు పాల్గొన్నారు.