అమ్మఒడి పథకం పొందని వారు దరఖాస్తు చేసుకోండి – కనిగిరి మండల విద్యాశాఖ అధికారి j ప్రసాద్ రావు

అమ్మఒడి పథకం పొందని వారు దరఖాస్తు చేసుకోండి – కనిగిరి మండల విద్యాశాఖ అధికారి j ప్రసాద్ రావు

కనిగిరి 18/12/20డిసెంబర్ 18 (న్యూస్ మేట్) : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నవరత్నాల లో భాగంగా విద్యార్థులకు అమ్మ ఒడి పథకం తో ఎంతో మేలు చేస్తుందని కనిగిరి విద్యాశాఖ అధికారి j ప్రసాదరావు అన్నారు. ఆయన మాట్లాడుతూ అమ్మ ఒడి పథకం తో విద్యార్థులకు లబ్ధి చేకూరుస్తుందని అందులో భాగంగా విద్యార్థుల తల్లులు రెండో విడత అమ్మ ఒడి దరఖాస్తు చేసుకోవాలని ఈ పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కొత్త నిబంధనలు చేసిందన్నారు. గతంలో దరఖాస్తు చేసుకుని లబ్ధి పొందని వారు కూడా పొరపాట్లను సరిచేసుకోనికి మరల దరఖాస్తు చేసుకోవాలని కొంతమంది ఆధార్ కార్డు పై భూమి లేకపోయినా అధిక భూమి నాలుగు చక్రాల వాహనాలు ఉన్నట్లుగా చూపిస్తుంది అన్నారు .అలాంటి సమస్యలను సచివాలయాల ద్వారా పరిష్కరించుకోవాలి అన్నారు. అమ్మఒడి పథకానికి దరఖాస్తు చేసుకునే తల్లి బిడ్డ ఇద్దరికీ ఆధార్ కార్డు తప్పనిసరి బిడ్డలు ఉన్న తల్లి పథకానికి ఒకే బ్యాంకు అకౌంట్ నెంబర్ ఇవ్వాలన్నారు. పది ఎకరాల కంటే ఎక్కువ పొలం ఉంటే అనర్హులు అన్నారు . 300 యూనిట్లు కరెంటు వినియోగించిన ప్రభుత్వ ఉద్యోగస్తుడు అయినా ప్రభుత్వం పెన్షన్ పొందుతున్న అనర్హులు అన్నారు . ఈ నెల చివరిలో అర్హులైన వారి వివరాలు సచివాలయాలు లో ఉంచడం జరుగుతుంది అన్నారు . 2021 జనవరి 9వ తారీఖున అర్హులకు అమ్మవడి నగదు బదిలీ చేయబడుతుంది అన్నారు.

Spread the love
Ad Widget

Recommended For You

About the Author: Newsmate

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *