రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేసేంతవరకు ఏ ఐ వై ఎఫ్ పోరాటాలు చేస్తుంది – అఖిల భారత యువజన సమాఖ్య జిల్లా ప్రధానకార్యదర్శి వై ఆనందమోహన్

రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేసేంతవరకు ఏ ఐ వై ఎఫ్ పోరాటాలు చేస్తుంది – అఖిల భారత యువజన సమాఖ్య జిల్లా ప్రధానకార్యదర్శి వై ఆనందమోహన్

కందుకూరు డిసెంబర్ 18 న్యూస్ మేట్:- 18/12/20కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేసేంతవరకు ఏ ఐ వై ఎఫ్ పోరాటాలు చేస్తుందని అఖిల భారత యువజన సమాఖ్య జిల్లా ప్రధానకార్యదర్శి వై .ఆనందమోహన్ తెలిపారు. అఖిలభారత యువజన సమాఖ్య రాష్ట్ర సమితి పిలుపుమేరకు ఏ ఐ వై ఎఫ్ కందుకూరు నియోజకవర్గ అధ్యక్షులు కలవకురి హరిబాబు ఆధ్వర్యంలో స్థానిక ఓ.వి.రోడ్ లో కొవ్వొత్తులతో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఏ ఐ వై ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వై ఆనందమోహన్ మాట్లాడుతూ బిజెపి ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాలను రద్దు చేయాలని ఢిల్లీలో గత ఇరవై రోజులుగా రైతులు చేస్తున్న ఆందోళనకు ఏ ఐ వై ఎఫ్ పూర్తి మద్దతు తెలుపుతున్నారు.రైతు దేశానికి వెన్నుముక అని చెప్పుకుంటూనే రైతన్న కడుపు కొట్టే ఇటువంటి చట్టాలను తీసుకు వస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రెండు వారాలు , మూడు వారాలు చర్చల పేరుతో కాలయాపన చేయకుండా వెంటనే రైతులకు వ్యతిరేకంగా తెచ్చిన టువంటి నల్ల చట్టాలను రద్దు చేయాలని వారు హెచ్చరించారు, రైతులకు శాపంగా మారిన మూడు నల్ల చట్టాలనూ తక్షణమే రద్దు చేసి రైతులకు మేలు జరిగే గిట్టుబాటు ధర కల్పించే చట్టాలను తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వాన్ని వారు కోరారు. ఈ రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేసేంత వరకు అఖిలభారత యువజన సమైక్య ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటాలు కొనసాగిస్తామని వారు అన్నారు.ఈ కార్యక్రమంలో ఏ ఐ టి యు సి జిల్లా అధ్యక్షులు బి సురేష్ బాబు ,ఏ ఐ వై ఎఫ్ కందుకూరు నియోజకవర్గ ఉపాధ్యక్షులు పసుపులేటి శ్రీనివాసులు ఏఐవైఎఫ్ నాయకులు రవి, కొంజెటి రవి, దుర్గారావు ,వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.

Spread the love
Ad Widget

Recommended For You

About the Author: Newsmate

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *