ఢిల్లీ రైతులకు మద్దతుగా అఖిల భారత యువజన సమాఖ్య ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ప్రదర్శన

ఢిల్లీ రైతులకు మద్దతుగా అఖిల భారత యువజన సమాఖ్య ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ప్రదర్శన

మార్కాపురం డిసెంబర్ 18 న్యూస్ మేట్:- 18/12/20గత 20 రోజులుగా నరేంద్ర మోడీ బిజెపి ప్రభుత్వం తీసుకొచ్చిన నల్ల చట్టాలు రద్దు చేయాలని ఆందోళన చేస్తున్న రైతులకు మద్దతుగా అఖిలభారత యువజన సమైక్య జిల్లా కోశాధికారి వై.వి.నారాయణమ్మ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించడం జరిగింది. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతిరోజు పాలకులు రైతు దేశానికి వెన్నెముక అని చెప్పుకుంటూనే రైతన్న కడుపు కొట్టే ఇటువంటి చట్టాలను తీసుకువస్తున్నారని ఆమె మండిపడ్డారు. చర్చలు పేరుతో కాలయాపన చేయకుండా వెంటనే రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని, లేని పక్షంలో అఖిలభారత యువజన సమైక్య ఆద్వర్యంలో దేశ వ్యాప్తంగా పోరాటాలు చేస్తామని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత యువజన సమాఖ్య నాయకులు పాల్గొన్నారు.

Spread the love
Ad Widget

Recommended For You

About the Author: Newsmate

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *