ఢిల్లీ రైతుల నిరసన కు మద్దతుగా అనంతసాగరం లో రైతుల కొవ్వొత్తుల ర్యాలీ మూడు వ్యవసాయ బిల్లులను రద్దు చేయాల్సిందే – ఏపీ రైతు సంఘం రాష్ట్ర నాయకులు కె వీరారెడ్డి డిమాండ్

ఢిల్లీ రైతుల నిరసన కు మద్దతుగా అనంతసాగరం లో రైతుల కొవ్వొత్తుల ర్యాలీ 18/12/20మూడు వ్యవసాయ బిల్లులను రద్దు చేయాల్సిందే – ఏపీ రైతు సంఘం రాష్ట్ర నాయకులు కె వీరారెడ్డి డిమాండ్

కందుకూరు డిసెంబర్ 18 న్యూస్ మేట్: మండల పరిధిలోని అనంతసాగరం గ్రామంలో ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో ఢిల్లీలో రైతులు చేస్తున్న నిరసనకు సంఘీభావంగా రైతులు శుక్రవారం రాత్రి కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి మూడు వ్యవసాయ పనులను రద్దు చేయాలని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమానికి కందుకూరు రైతు సంఘం నాయకులు లక్ష్మీనారాయణ అధ్యక్షత వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏపీ రైతు సంఘం రాష్ట్ర నాయకులు కే వీరారెడ్డి పాల్గొని మాట్లాడుతూ ఇప్పటికే వ్యవసాయం సాగు తో నిరంతరం పోరాటం చేస్తున్న రైతన్నలకు కోలుకోని విధంగా కేంద్ర ప్రభుత్వం 3 వ్యవసాయ బిల్లులను అమలు చేసి రైతులను కార్పొరేట్ వ్యాపార సంస్థలకు చేసే కుట్రలో భాగమే ఈ నూతన బిల్లులని ధ్వజమెత్తారు. గత 22 రోజులుగా ఎముకలు కొరికే చలిలో రైతులు ఢిల్లీ నగరంలో నిరసన దీక్ష చేస్తున్న ప్రభుత్వానికి పట్టకపోవటం దురదృష్టకరమని అన్నారు. అనేకమార్లు రైతులతో చర్చలు జరుపుతామని పేర్కొంటున్న కేంద్ర ప్రభుత్వం రైతులు కోరిన విధానాలను అమలు చేస్తామని ఇప్పటికే హామీ ఇవ్వలేదని అన్నారు. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా ఉన్న రైతులందరూ ఏకతాటిపై ముందుకు సాగి రైతులకు గుదిబండగా మారిన 3 వ్యవసాయ బిల్లులు రద్దు చేసే వరకు ఉద్యమించాలని అన్నారు . ఈ కార్యక్రమంలో నాయకులు అశోక్ ,ప్రసాద్ , వంశీ ,కృష్ణ ,కిషోర్ ,నవీన్ , అనిల్ కుమార్ ,నరేంద్ర ,నవీన్ , రామకృష్ణ ,రాజేంద్ర ప్రసాద్ , గోపి తదితరులు పాల్గొన్నారు

Spread the love
Ad Widget

Recommended For You

About the Author: Newsmate

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *