ఆ చట్టాలు అదాని అంబానీలకు అనుకూలం.. రైతు సంఘాల ఆరోపణ
ఒంగోలు డిసెంబర్ 18 న్యూస్ మేట్ : అదాని అంబానీ లకు అనుకూలమైన చట్టాలు రద్దు చేసే వరకు రైతన్నలు ఉద్యమిస్తూనే ఉంటారని ఏపీ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె వి వి ప్రసాద్ అన్నారు .అఖిలభారత కిసాన్ సంఘర్ష్ కో ఆర్డినేషన్ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం రిలయన్స్ డిజిటల్ ఎదురు నిరసన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి సిపిఐ ఎంఎల్ నాయకులు నాంచార్ లు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా కె.వి వి ప్రసాద్ మాట్లాడుతూ దేశంలో రైతన్నలకు వ్యతిరేకంగా నల్ల చట్టాలు ప్రవేశపెట్టిన కేంద్ర ప్రభుత్వ విధానాలు మానుకునే వరకు ఉద్యమం ఆగదని హెచ్చరించారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన మూడు చట్టాలు రైతులకు ఏమాత్రం అనుకూలం కాదని ఆదానీ అంబానీలకు అనుకూలమైన కట్టాలని ఆయన అన్నారు . దేశవ్యాప్తంగా ముక్త కంఠంతో రైతులు నిరసన ధ్వనులు వినిపిస్తుంటే నరేంద్ర మోడీకి చీమకుట్టినట్టు లేదని ఆయన విమర్శించారు.కార్పొరేట్ సంస్థల ఉత్పత్తులను భారత దేశ వ్యాప్తంగా బహిష్కరించాలని ఆయన పిలుపునిచ్చారు. ఎన్నికల సమయంలో బీజేపీకి కోట్ల రూపాయల ఎన్నికల నిధులు ఇవ్వటంతో బిజెపి కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా చట్టాలు చేస్తున్నదని ఆయన దుయ్యబట్టారు. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎం ఎల్ నారాయణ ట్లాడుతూ భారత దేశ వ్యాప్తంగా రైతులు చేస్తున్న ఉద్యమానికి ప్రతి ఒక్కరు మద్దతు తెలియజేయడంతో పాటు ప్రత్యక్ష ఉద్యమంలోకి రావాలని పిలుపునిచ్చారు. కార్పొరేట్ శక్తులకు వూడిగం చేస్తున్న కేంద్ర ప్రభుత్వం రైతులకు వ్యతిరేక చట్టాలు చేస్తూ రైతుల జీవితాలను సర్వనాశనం చేస్తున్నదని ఆయన విమర్శించారు. రైతు వ్యతిరేక చట్టాలు రద్దు అయ్యే వరకు రైతు సాగిస్తున్న ఉద్యమానికి సిపిఐ అండగా నిలుస్తుందని ఆయన అన్నారు. సిఐటియు రాష్ట్ర నాయకులు సిద్దయ్య మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రైతుల నడ్డివిరిచే చట్టాలు చేస్తూ మేము రైతు అనుకూలం అనటం దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని విమర్శించారు. దేశవ్యాప్తంగా లక్షలాది మంది రైతులు ఉద్యమంలో పాల్గొంటున్నా సిగ్గులేని ప్రభుత్వం రైతులను పట్టించుకోవడంలేదని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ శక్తుల చేతుల్లో కీలుబొమ్మగా మారిందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్ వెంకట్ రావు ఏ ఐ టి యు సి జిల్లా గౌరవ అధ్యక్షులు ఎస్డి సర్దార్ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు విజయ సిపిఐ నాయకులు ప్రకాష్ రావు మస్తాన్ సంతనూతలపాడు నియోజకవర్గ కార్యదర్శి నల్లూరి మురళి మద్దిపాడు మండల కార్యదర్శి దాసరి అంజయ్య కొత్తపట్నం మండలం కార్యదర్శి పురిణి గోపి సిపిఎం నాయకులు జాలా అంజయ్య పూనాటి ఆంజనేయులు కంకణాల ఆంజనేయులు రఘురాం సిపిఐ ఎంఎల్ నాయకులు లలిత కుమారి చిట్టి పాట వెంకటేశ్వర్లు స్వామి రైతు సంఘాల నాయకులు కే హనుమారెడ్డి వెంకట్ రావు చుంచు శేషయ్య హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు.