పంట నష్ట పోయిన రైతులకు పరిహారం వెంటనే చెల్లించాలి. చంచల బాబు యాదవ్.
ఉదయగిరి డిసెంబర్ 18 (న్యూస్ మెట్) : తుఫాను కారణంగా పంట నష్టపోయిన రైతాంగానికి పరిహారం వెంటనే చెల్లించాలని మాజీ జిల్లా పరిషత్ చైర్మన్, తెలుగుదేశం పార్టీ నాయకులు అయిన పొన్నె బోయిన. చంచల్ బాబు యాదవ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం ఉదయగిరి లోని ఆయన స్వగృహంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతులకు మినుము పంట కు 4000, వరికి 6000 పరిహారం చెల్లిస్తామని ప్రభుత్వం ప్రకటించడం దారుణమైన విషయమన్నారు. రైతు పక్షపాతి అని చెప్పుకుంటున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రైతులను చిన్నచూపు చూడడం అవుతుందని తక్షణమే ఎకరానికి 10వేల నుంచి 15 వేల రూపాయలు నష్టపరిహారం చెల్లించి రైతులను ఆదుకోవాలని ఆయన కోరారు. ఒక ఎకరం పొలంలో వరి నాటేందుకు 30 వేల రూపాయలు ఖర్చు అవుతుందని కనీసం 10 నుంచి 15 వేల ఇవ్వకపోతే ఆ రైతు కుటుంబం పరిస్థితి ఏమిటని ఆయన ప్రశ్నించారు. వర్షాలు వరంగా మారాల్సింది పోయి, శాపంగా మారాయని అసలే పేదరికానికి చిరునామాగా మారిన ఉదయగిరి నియోజకవర్గంలో అతివృష్టి, అనావృష్టి తో అవస్థలు పడుతున్న రైతాంగానికి ప్రభుత్వం ప్రకటించిన 4000 6,000 సాయం ఏ మూలకు సరిపోతుందో ఆలోచించాలని ఆయన అన్నారు ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ నాయకులు షేక్. రియాజ్, బయన్న,వెంకటస్వామి, అంబటి. మస్తానయ్య తదితరులు పాల్గొన్నారు.