సోమలరేగడలో డ్రై డే ప్రైడే కార్యక్రమం

సోమలరేగడలో డ్రై డే ప్రైడే కార్యక్రమం18/12/20

దుత్తలూరు డిసెంబర్ 18 న్యూస్ మేట్:- దుత్తలూరు మండలం సోమలరేగడలో గ్రామంలో శుక్రవారం డ్రైడే- ప్రైడే కార్యక్రమం నిర్వహించారు .ఈ కార్యక్రమం లో ఈవో పిఆర్డీ జహీర్ మాట్లాడుతూ గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరారు . ఇంటి పరిసరాలలో మురికి నీటిని నిల్వ ఉండకుండా చూడాలని కోరారు . పేడ దిబ్బలను నివాసాలకు దూరంగా వెయ్యాలని అన్నారు. పరిసరాల పరిశుభ్రత పాటించాలి అని అది అందరూ ఒక బాధ్యత గా స్వీకరించాలి అని అన్నారు. కార్యక్రమం లో హెల్త్ సూపర్ వైజర్ జగన్ మోహన్ ,పంచాయతీ కార్యదర్శి ఎం .నాగరాజు సచివాలయ సిబ్బంది, ఆశా వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు .

Spread the love
Ad Widget

Recommended For You

About the Author: Newsmate

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *