రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేసే వరకు ఉద్యమం ఆగదు
కొత్తపట్నం డిసెంబర్ 20 న్యూస్ మేట్ :పార్లమెంటులో ఆమోదించిన 3 వ్యవసాయం చట్టాలను రద్దు చేయాలని ఢిల్లీలో రైతులు చేస్తున్న దీక్షలు 33 మంది రైతు అమరులకు సంతాప దినంగా ఆదివారం కొత్తపట్నంలో ఏపీ మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో అమరులైన రైతులకు నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమం
లో ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్ష కార్యదర్శిలు యస్.రావమ్మ,యమ్.విజయ,లక్ష్మి పాల్గొని మాట్లాడుతూ వ్యవసాయాన్ని కార్పొరేట్ పరం చేసి చట్టాలు గురించి వాటి వల్ల రైతులకు,వ్యవసాయ కూలీలకు జరిగే నష్టం గురించి పొలం లో పని చేస్తున్న కూలీలకు తెలియ జేసి రైతాంగ పోరాటంలో కలిసి రావాలని కోరారు. కార్యక్రమంలోఆర్.కుమారి,జాలమ్మ,తిరుపతమ్మ,యస్.నాగలక్ష్మీ,వెంకటరమణమ్మ,రాజు.పద్మ,వి.రమణ,కె.వేంకటేశ్వరమ్మ,ఆర్.మీరమ్మ,యస్.మంగమ్మ,సీపీఐ మండల కార్యదర్శి పురిణి.గోపి,వెంకటేశ్వర్లు,జాజుల.జాలరాం,రాజు.శ్రీను తదితరులు పాల్గొన్నారు.