• సంఘటన జరిగి 36 గంటలైనా భువనేశ్వర్ ఉదంతాన్ని హత్య ఆత్మహత్య నిర్ధారించ లేకపోవడం ప్రభుత్వ వైఫల్యం.• పోస్ట్ మార్టం నిర్వహించడంలో జరిగిన ఆలస్యం కూడా పలు అనుమానాలకు తావిస్తుంది.• భువనేశ్వరి కుటుంబానికి కోటి రూపాయలు ఎక్స్ గ్రేషియా ప్రకటించాలి.

• సంఘటన జరిగి 36 గంటలైనా భువనేశ్వర్ ఉదంతాన్ని హత్య ఆత్మహత్య నిర్ధారించ లేకపోవడం ప్రభుత్వ వైఫల్యం.
• పోస్ట్ మార్టం నిర్వహించడంలో జరిగిన ఆలస్యం కూడా పలు అనుమానాలకు తావిస్తుంది.
• భువనేశ్వరి కుటుంబానికి కోటి రూపాయలు ఎక్స్ గ్రేషియా ప్రకటించాలి.

20/12/20

ఒంగోలు డిశంబరు 20 న్యూస్ మేట్ :ఒంగోలు నగరంలో కమ్మపాలెం వార్డ్ వాలంటీర్ గా పనిచేస్తున్న భువనేశ్వరి దుర్మరణం ఘటన వెనుక ఉన్న నిజానిజాలను నిగ్గు తేల్చి బాదిత కుటుంబానికి సత్వర న్యాయం జరిగేలా చూడాలని ఒంగోలు పార్లమెంట్ టిడిపి అధ్యక్షులు డాక్టర్ నూకసాని బాలాజి ఆదివారం పాత్రికేయుల సమావేశంలో డిమాండ్ చేశారు. సంఘటన జరిగి 36 గంటలైనా భువనేశ్వర్ ఉదంతాన్ని హత్య? ఆత్మహత్య? నిర్ధారించ లేకపోవడం ప్రభుత్వ వైఫల్యం అని ఆయన అన్నారు. తన బిడ్డని హత్య చేశారని భువనేశ్వరి తల్లి ఆరోపించారని, ఆ దిశగా పోలీసులు దర్యాప్తు చేసి దొషులను కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు.శుక్రవారం రాత్రి 9 గంటలకు ఘటన జరిగి, అర్ధరాత్రి 12 గంటలకు భువనేశ్వరి మృతదేహాన్ని వైద్యశాలకు తీసుకు వచ్చినప్పటికీ శనివారం సాయంత్రం 4 గంటల వరకు పోస్టుమార్టం నిర్వహించక పోవడం పలు అనుమానాలకు తావిస్తోందని, ఇలా జరగడం వెనుక ఎవరి వైఫల్యం ఉంది. వారు పోలీసులా, వైద్యులా లేక ప్రభుత్వమా అని ఆయన ప్రశ్నించారు. పోస్ట్ మార్టం ఆలస్యం చేయడంలో హత్య కాదు ఆత్మహత్యాగా చిత్రికరించ్డంలో ఏమైనా ప్రయత్నాలు జరుగుతున్నయా, అనే సందేహాన్ని ఆయన వెలుబుచ్చారు. జిల్లాలో ఉన్న ప్రభుత్వ పెద్దలు, వై.ఎస్.ఆర్.సి.పి. నాయకులు మృతదేహాన్ని సందర్శించక పోవడం, కనీసం ఆ కుటుంబాన్ని పరామర్శించకపోవడం వంటి దుర్మార్గపు పరిస్థితులు జిల్లా లో ఉన్నాయని ఆయన అన్నారు. పోలీసులు భువనేశ్వరి మృతి విషయంలో దర్యాప్తును వేగవంతం చేసి వాస్తవాన్ని వెలుగులోకి తీసుకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన అన్నారు. ఈ ప్రభుత్వంలో మహిళలకు, దివ్యాంగులకు, బడుగు బలహీనవర్గాలకు, దళితులకు రక్షణ లేకుండా పోయిందని, రాష్ట్రంలో ఒక మహిళ హోం మంత్రిగా ఉన్నప్పటికీ మహిళలకి రక్షణ కొరవడడం అత్యంత సిగ్గుచేటైన విషయం అని ఆయన విమర్శించారు. విభిన్న ప్రతిభావంతురాలైన భువనేశ్వరి మృతి వల్ల ఆమె కుటుంబం దిక్కులేని దయ్యిందని ఆ కుటుంబానికి కోటి రూపాయల ఆర్థిక సహాయం ప్రకటించాలని, ఆ కుటుంబంలో ఒకరికి ఉద్యోగ వసతి కల్పించాలని, డిమాండ్ చేశారు . ఆ కుటుంబానికి న్యాయం జరిగే వరకు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని ఆయన తెలిపారు. రాష్ట్రంలో మహిళల రక్షణ కోసమని దిశ చట్టాన్ని తిసుకువచ్చారని దానిని కేంద్ర ప్రభుత్వం వెనక్కి తిప్పి పంపడాని, మహిళల పై చిత్త శుద్ది ఉంటే ఆ చట్టాన్ని సవరణలు చేసి ఎందుకు తీసుకురాలేదని ఆయన ఘాటుగా ప్రశ్నించారు. మహిళలకు రక్షణ కల్పించలేని దిశ లేని దిశ చట్టం ఎందుకని, దిశ చట్టం చేసిన తరువాతనే మహిళలపై దాడులు పెరిగి పోయాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.తన బిడ్డకి హైదరాబాదులోని ఎస్ బ్యాంక్ నందు ఉద్యోగం వచ్చినప్పటికీ తన బిడ్డ తన కళ్ళ ఎదురుగానే ఉంటుందని జీతం తక్కువ అయినప్పటికీ వార్డు వాలంటీర్ గా చేర్పించామని తన కుటుంబానికి ఆసరాగా ఉన్న బిడ్డ కోల్పోవడం తన కుటుంబంకు తీరనిలోటని ఆ తల్లి పడే మానసిక వేదన తీర్చడం ఎవరి వల్లా కాదని కనుక ఈ దుర్ఘటన వెనుక ఉన్న నిజానిజాలను వెంటనే వెలికితీసి ఆ కుటుంబానికి సత్వర న్యాయం చేయాలని ఆయన అన్నారు.రాష్ట్రంలోని మంత్రులు ఇష్టారీతిన మాట్లాడుతున్నారనీ, మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్షం నాయకుల్ని, ఐఏఎస్ అధికారులు, రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న వారిని ఎవరినైనా సరే నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని, ఇలా మంత్రులు బరితెగించి మాట్లాడటం వల్లే పోలీసుల మీద, న్యాయ వ్యవస్థ మీద కొందరికి గౌరవం పోయి ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.వైసిపి ప్రభుత్వ 18 నెలల కాలంలో మహిళలకు రక్షణ కరువైంది ఇది దుర్మార్గమైన పరిపాలన, బడుగు బలహీనవర్గాలు దళితులు మహిళల మీద దివ్యాంగుల మీద జరుగుతున్న దాడుల్లో దోషులను శిక్షించడంలోఈ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

Spread the love
Ad Widget

Recommended For You

About the Author: Newsmate

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *