మండ్రు రమేష్ బాబు సేవలకు డాక్టరేట్ ప్రదానం చేసిన నేషనల్ గ్లోబల్ పీస్ యూనివర్సిటీ

మండ్రు రమేష్ బాబు సేవలకు డాక్టరేట్ ప్రదానం చేసిన నేషనల్ గ్లోబల్ పీస్ యూనివర్సిటీ20/12/20

 

కనిగిరి డిసెంబర్ 20 (న్యూస్ మేట్) : ప్రజా రవాణా శాఖ ఉద్యోగి , ఆర్టీసీ కండక్టర్ గుడ్ హెల్ప్ సంస్థ మండ్రు రమేష్ బాబు గౌరవ డాక్టరేట్ స్వీకరించారు.ఆదివారం హోసూరు, తమిళనాడు నందు నేషనల్ పీపుల్స్ పార్టీ అధ్యక్షుడు డాక్టర్. యస్. శశి ఆర్విన్ యూనివర్సల్ డెవలప్మెంట్ కౌన్సిల్ వారీ ఆధ్వర్యంలో హోసూరు స్థానిక యం.యల్.ఏ. డా. కే.ఏ. మనోహరన్ ముఖ్య అతిథులుగా హాజరై పలు రంగాల్లో విశిష్ట సేవలందించిన వారికి గౌరవ డాక్టరేట్ పట్టాలు ప్రధానం చేశారు. అందులో భాగంగా హోసూరు స్థానిక ఫైవ్ స్టార్ హోటల్ క్లారెస్టాలో ఘనంగా జరిగిన అవార్డుల కార్యక్రమంలో దాదాపు 35 మందికి గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసిన కార్యక్రమంలో భాగంగా ప్రకాశం జిల్లా కనిగిరి పట్టణ వాసి మండ్రు రమేష్ బాబు 20 సంత్సరాలుగా చేస్తున్న సామాజికసేవలను గుర్తించి, సామాజిక సేవా విభాగంలో ఇంటర్నేషనల్ గ్లోబల్ పిస్ యూనివర్సిటీ వారు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేశారు.కర్ణాటక రాష్ట్ర బాలల హక్కుల కమీషనర్ వై మర్రిస్వామి, హోసూరు పీఠాధిపతి స్వామి బ్రహ్మర్షి కర్ణాటక తెలుగు తేజం వీక్లీ సంపాదకులు బి. మాల్యాద్రి, యస్. గుగనేశ్వరన్ తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ సభ్యుడు బారికి చంద్రశేఖర్ రావు అతిథిలుగా హాజరై పలువురు అవార్డు గ్రహీతలను అభినందించారు. మండ్రు రమేష్ బాబు గుడ్ హెల్ప్ సంస్థ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు చేస్తున్న సంగతి తెలిసిందే.రమేష్ బాబు కనిగిరి ప్రాంతంలో ఆర్టీసీలో కండక్టర్ గా పనిచేస్తూ వృత్తి పరంగా కూడాపేరు గడించి మిత్రుల సహకారంతో గుడ్ హెల్ప్ పేరుతో స్వచ్చంద సంస్థకు శ్రీకారం చుట్టారు. ఈ సంస్థ ద్వారా అనేకమందిని సేవా తత్పరులుగా తయారు చేసి సమాజానికి నిస్వార్ధంగా సేవలందిస్తున్నారు. ముఖ్యంగా కరోనా క్లిష్ట కాలంలో రమేష్ బాబు అందిస్తున్న సేవలు ఆయనకు మరింత పేరు ప్రతిష్టలు తెచ్చిపెడుతున్నాయి. నిర్విరామంగా ప్రజల కోసం, పారా లీగల్ వాలంటీర్ గా , రెడ్ క్రాస్ సొసైటీ వాలంటీర్ గా ఆయన చేస్తున్న సేవలకు గాను ప్రతిష్టాత్మక గా ఇంటర్నేషనల్ గ్లోబల్ పీస్ యూనివర్శిటీ ఆయనకు గౌరవ డాక్టరేట్ ప్రధానం చేసింది.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2000 సంవత్సరంలో గుంటూరు జిల్లాలో అసిస్ట్ ఇండియా అనే స్వచ్ఛంద సంస్థలో తిరువీదుల శ్రీనివాసరావు సమక్షంలో సామాజిక కార్యకర్తగా చేరి అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఒక సంవత్సరం సార్డ్స్ సంస్థలో పని చేసి అనంతరం 2009 లో ఏపీఎస్ఆర్టిసి కండక్టర్ గా చేరి ఉద్యోగాన్ని వృత్తిగా సామాజిక సేవను ప్రవృత్తిగా చేస్తూ సంతృప్తి పడుతున్న సమయంలో నాకు డాక్టరేట్ అవార్డు రావడం చాలా ఆనందంగా ఉందని నన్ను సేవా కార్యక్రమంలో ప్రభుత్వ ప్రభుత్వేతర సంస్థలలో భాగస్వామి చేసి నడిపించిన అసిస్ట డైరెక్టర్ జాస్తి రంగారావు, డైరెక్టర్ వియాని మేడం కు అలాగే సేవా కార్యక్రమాలకు సహకరిస్తున్న ఏపీఎస్ఆర్టీసీ అధికారులకు, ప్రభుత్వ అధికారులకు, ప్రజాప్రతినిధులకు, జర్నలిస్టు మిత్రులకు, స్వచ్ఛంద సేవా కార్యకర్తలకు, ప్రజా సంఘాల వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ అవార్డును గుడ్ హెల్ప్ సభ్యులకు, నా మిత్రులకు, సేవా కార్యక్రమాలకు సహకరిస్తున్న నా శ్రేయోభిలాషులకు వినమ్రంగా అంకితం చేస్తున్నాను’ అన్నారు. . ఆయనకు డాక్టరేట్ ఇవ్వడం పట్ల మిత్రులు, శ్రేయోభిలాషులు, పట్టణ ప్రముఖులు సంతోషం వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Spread the love
Ad Widget

Recommended For You

About the Author: Newsmate

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *