వ్యవసాయ వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలి

వ్యవసాయ వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలి

20/12/20
కనిగిరి డిసెంబర్ 20 (న్యూస్ మేట్) : కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ఆమోదించిన మూడు వ్యవసాయం చట్టాలను రద్దు చేయాలని ఢిల్లీలో రైతులు చేస్తున్న దీక్షలో అమరులైన 33 మంది రైతు అమరులకు సంతాప దినంగా ఆదివారం కనిగిరిలో సుగుణావతమ్మ హాస్పిటల్ సెంటర్ వద్ద జరిగింది. ఈ సంతాప కార్యక్రమంలో సిపిఐ కనిగిరి నియోజకవర్గం రైతు సంఘం, ఏఐటీయూసీ, ఏ ఐ వై ఎఫ్, ఏపీ మహిళా సమాఖ్య మరియు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో అమరులైన రైతులకు నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఐ నియోజకవర్గ సహాయ కార్యదర్శి సయ్యద్ యాసీన్ మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం రైతులను కూలీలుగా మార్చే వ్యవసాయ నల్ల చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు .కేంద్ర ప్రభుత్వ సంస్థలన్నీ ఆధాని, అంబానీలకు కట్టబెడుతూ వ్యవసాయ ఉత్పత్తులు కూడా ప్రైవేటు కంపెనీలకు అనుకూలంగా ధారాదత్తం చేసే చీకటి చట్టాలను రద్దు చేసే వరకు ఉద్యమిస్తామన్నారు. ఈ క్రమంలో ఢిల్లీలో జరిగే రైతు దీక్షలో అమరులైన రైతుల చిత్రపటాలకు పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ కనిగిరి నియోజకవర్గ కార్యదర్శి ఎస్.కె మహబూబ్ పీరా, రైతు సంఘం నాయకులు గుజ్జుల బాలిరెడ్డి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి జి పి రామారావు, ఏ ఐ వై ఎఫ్ కనిగిరి నియోజకవర్గ అధ్యక్షులు పుట్టా సుబ్బారావు, దళిత హక్కుల పోరాట సమితి జిల్లా ఉపాధ్యక్షులు పందిటి మోహన్ ,ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య జిల్లా కార్యదర్శి జి గాయత్రి ,విద్యార్థి యువజన సంఘ బాధ్యులు షేర్ స్టాలిన్, ఏ ఐఎస్ఎఫ్ కనిగిరి మండల కన్వీనర్ సిహెచ్ పవన్ కళ్యాణ్ ,అంజి ,బలహీన వర్గాల నాయకులు కాకి నరసయ్య ,ఏఐటీయూసీ పట్టణ కార్యదర్శి వెంకటేశ్వర్లు ,బిల్లింగ్ వర్కర్స్ యూనియన్ నాయకులు కనమర్ల కృష్ణారెడ్డి ,యోగి రెడ్డి ,చిన్నక్క , తిరుపాలు, పిచ్చి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Spread the love
Ad Widget

Recommended For You

About the Author: Newsmate

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *