యుటిఎఫ్ కార్యాలయానికి కంప్యూటర్ బహుకరణ

యుటిఎఫ్ కార్యాలయానికి కంప్యూటర్ బహుకరణ
కందుకూరు డిసెంబర్ 20 న్యూస్20/12/20 మేట్ : అధ్యయనం అధ్యాపనం సామాజిక స్పృహ అనే నినాదంతో యు టి ఎఫ్ పనిచేస్తుందని రిటైర్డ్ ఉపాధ్యాయులు మాదాల మాల్యాద్రి అన్నారు. ఆయన ఆదివారం యుటిఎఫ్ కార్యాలయానికి కంప్యూటర్ బహుకరించారు ,ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ యు టి ఎఫ్ నిరంతరం ఉపాధ్యాయుల సమస్యల కోసం అలుపెరుగని పోరాటం చేస్తున్నదని అన్నారు. అనేక సంవత్సరాలు తాను యు టి ఎప్ లో పని చేశానని తనకు తల్లి లాంటి యూ టి ఎప్ రుణం ఎప్పటికీ తీర్చుకోలేను అని ఆయన అన్నారు. మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ ఉప్పుటూరు శ్రీనివాసరావు మాట్లాడుతూ యు టి ఎఫ్ లో తనకు అనేక మంది మిత్రులు ఉన్నారని వారంతా ఉపాధ్యాయ సమస్యలపై నిరంతరం పోరాడుతున్నారని అన్నారు. ఉపాధ్యాయ సమస్యలపై నిరంతరం పోరాడే ఉపాధ్యాయ సంఘం గా కలకాలం ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సిహెచ్ రామకృష్ణ రావు ,ప్రభాకర్ యుటిఎప్ నాయకులు ఎం కోటేశ్వరరావు నారాయణ తదితరులు పాల్గొన్నారు.

Spread the love
Ad Widget

Recommended For You

About the Author: Newsmate

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *