రైతు వ్యతిరేక చట్టాలు రద్దు అయ్యే వరకు పోరాటం ఆగదు

20/12/20రైతు వ్యతిరేక చట్టాలు రద్దు అయ్యే వరకు పోరాటం ఆగదు

పొదిలి డిసెంబర్ 20 న్యూస్ మేట్ : పార్లమెంటులో ఆమోదించిన 3 వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని ఢిల్లీలో రైతులు చేస్తున్న దీక్షలో అమరులైన 33 మంది రైతు అమరులకు సంతాప దినంగా ఈరోజు పొదిలి మండలం కుంచా పల్లి గ్రామం సంతాపసూచకంగా కొవ్వొత్తులతో నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా సిపిఐ మండల కార్యదర్శి కె.వి రత్నం మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రైతులకు తీరని ద్రోహం చేసే చట్టాలను ప్రవేశపెట్టి భారతదేశ రైతాంగాన్ని నిలువునా దగా చేస్తుందని అన్నారు. ఢిల్లీ నగరంలో లక్షలాది మంది రైతులు చలిని సైతం లెక్కచేయకుండా భారతదేశ రైతాంగాన్ని కార్పొరేట్ శక్తుల కోరల్లో చిక్కకుండా చట్టాలను రద్దు చేయాలని కోరుతూ చేస్తున్న ఉద్యమానికి రైతాంగం సంపూర్ణ మద్దతు తెలియజేయాలని కోరారు. పార్లమెంటులో ప్రవేశపెట్టిన మూడు రైతాంగ వ్యతిరేక బిల్లులు రద్దు చేయాలని అంతవరకు ఉద్యమం ఆగదని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు .ఈ కార్యక్రమంలో సిపిఎం కార్యదర్శి రమేష్ మరియు రైతు సంఘాల నాయకులు పాల్గొన్నారు.

Spread the love
Ad Widget

Recommended For You

About the Author: Newsmate

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *