ప్రజా శ్రేయస్సు జగన్ లక్ష్యం

ప్రజా శ్రేయస్సు జగన్ లక్ష్యం21/12/20

దుత్తలూరు డిసెంబరు 21 న్యూస్ మేట్ : దుత్తలూరు మండలంలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పుట్టినోజు వేడుకలు నిర్వహించారు. కరోనా కారణంగా ఎటువంటి హంగు ఆర్భాటం లేకుండా నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఉదయగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డి గారు పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రజల శ్రేయస్సే మన ముఖ్యమంత్రి జగన్ లక్ష్యం అని పరిపాలన చేపట్టిన అతి తక్కువ సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేశారు అని ఆయన అన్నారు.ముఖ్యమంత్రి పై ప్రతిపక్ష పార్టీలు చేసే విమర్శలో నిజం లేదు అని విమర్శించారు. ముఖ్యమంత్రి జగన్ ఇలాంటి పుట్టిన రోజులు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ సందర్బంగా రెడ్ క్రాస్ వారు ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరం ప్రారంభించారు. జగన్ ప్రజా సేవలో ఉంటే ఆయన అభిమానులయిన మీరు రక్తదానం చేసి ప్రజల ప్రాణాలు కాపాడుతున్నారు అని అన్నారు. రక్తదాన శిబిరం లో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ కృత్ఞతలు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో వైఎ్సార్సీపీ మండల కన్వీనర్ వాసుదేవ రెడ్డి, వైఎస్ఆర్ సీపీ నాయకులు వాసిపల్లి వేంకటేశ్వర్లు రెడ్డి, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

Spread the love
Ad Widget

Recommended For You

About the Author: Newsmate

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *