ఎమ్మెల్యే బుర్ర మధుసూద యాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా జననేత జగన్ అన్న జన్మదిన వేడుకలు

ఎమ్మెల్యే బుర్ర మధుసూద యాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా జననేత జగన్ అన్న జన్మదిన వేడుకలు 21/12/20
కనిగిరి డిసెంబర్ 21 (న్యూస్ మేట్) : రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు కనిగిరి ఎమ్మెల్యే బుర్ర మధుసూదన్ యాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. జననేత జగన్ అన్నకు నూరేళ్ళు దీర్ఘ ఆయుష్షు ఇవ్వాలని వారి పాలన రాష్ట్రానికి నిరంతరం కొనసాగాలని ఆకాంక్షిస్తున్నట్లు కనిగిరి ఎమ్మెల్యే బుర్ర మధుసూదన్ యాదవ్ అన్నారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా కనిగిరి వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసిన ఆయన అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు తరువాత రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి ఒంగోలు బస్టాండ్ నందు పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర జగన్ అన్న పాలన ప్రజారంజకంగా జరుగుతుందని సంక్షేమ ఫలాలు ప్రతి ఒక్కరికి అందుతున్నాయని అన్నారు. నిండు నూరేళ్లు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కి ఆ దేవుడు ఇవ్వాలని కోరుకుంటున్నట్లు తెలియజేశారు ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు అబ్దుల్ గఫార్ డాక్టర్ పెరుగు మురళి కృష్ణ. జడ్పిటిసి మడతల కస్తూరి రెడ్డి. మహిళా అధ్యక్షురాలు తమ్మినేని సుజాత నాయకులు కార్యకర్తలు జగన్ అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

Spread the love
Ad Widget

Recommended For You

About the Author: Newsmate

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *