సీతారాంపురం 60 అడుగుల రోడ్డు సెంటర్ ని అభివృద్ధి చేయాలి
ఒంగోలు డిసెంబర్ 21 న్యూస్ మేట్ : సీతారామపురం 60 అడుగుల రోడ్డు సెంటర్ డిజిటల్ లైటింగ్ , రెండు వైపుల డ్రైనేజ్ మరియు ఫ్లాట్ ఫారం ఏర్పాటు చేయాలని ఒంగోలు సిటీ అసోసియేషన్ అధ్యక్షుడు కొల్లా మధు సోమవారం ఒక ప్రకటనలో కోరారు. ఒంగోలు నగర పాలక సంస్థ ఏరియాలో సీతారామపురం కాలనీ ప్రధానమైనది . గద్దలగుంట పాలెం , మామిడి పాలెం సెంటర్ నుంచి సీతారామపురం సి ఎస్ ఆర్ కాలేజీ గ్రౌండ్ మీదగా శర్మకాలేజీ , అంబేద్కర్ ఆడిటోరియం మీదుగా ప్రకాశం భవనం వరకు 60 అడుగుల రోడ్డు ఈమధ్య సిమెంట్ రోడ్డు వేశారని ఆయన తెలిపారు. అయితే కొంత భాగం రెండు వైపుల బాగ డౌన్ ఉంది రోడ్డు అలాగే రెండు వైపుల ఎత్తు కూడ. మోటార్ బైక్ లు కార్లు చాల స్పీడ్ గా వెళు తున్నారు ఆ స్పీడ్ తగ్గించడానికి స్పీడ్ బ్రేకర్ ఒక్కటి నిర్మాణం చేయగలిగితే బాగుంటుంది అని ఆయన అన్నారు. అలాగే సెంటర్ లైటింగ్ ఏర్పాటు చేయాలని రెండు వైపు ల డ్రైనేజ్ నిర్మాణం అలాగే రెండు వైపులా ఫుట్ పాత్ లు ఏర్పాటు చేయాలని మధు కోరారు.