ఆడంబరంగా జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు

ఆడంబరంగా జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు21/12/20
దర్శి డిసెంబర్ 21 న్యూస్ మేట్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వై యస్ జగన్ మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ నాయకులు, కార్యకర్తలతో కలిసి పొదిలి రోడ్డు లోని డిఎస్పి ఆఫీస్ నుండి బారి ఎత్తున ర్యాలీ బయలుదేరి గడియార స్తంభం దగ్గర ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ వై యస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తరువాత జగన్ మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా నాయకులు ఎర్పాటు చేసిన కేకును కట్ చేసి నాయకులకు, కార్యకర్తలకు పంచి పెట్టారు. అక్కడ నుండి బయలుదేరి దర్శి ప్రభుత్వ జూనియర్ కళాశాల నందు ఎర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ ప్రారంభించారు. తరువాత ఎర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ జగన్ మోహన్ రెడ్డి ప్రవేశ పెట్టిన నవరత్నాలు ప్రతిపేదవాడికి లబ్ది పొందు తన్నాడు అని తెలియచేసారు. అనంతరం డ్వాక్రా మహిళలకు చెక్కులు అందించారు. వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులకు, కార్యకర్తలకు,అభిమానులకు, మరియు అక్కడకువచ్చిన డ్వాక్రా మహిళలకి ఘనంగా భోజనలు ఎర్పాటు చేశారు.

Spread the love
Ad Widget

Recommended For You

About the Author: Newsmate

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *