ఘనంగా సీఎం జగన్ మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు.
వలేటివారిపాలెం డిసెంబర్ 21 న్యూస్ మెట్ : మండల కేంద్రమైన వలేటివారిపాలెం వైకాపా కార్యాలయంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా వైసీపీ నాయకులు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలన్నిటిని తొలి ఏడాదిలోనే అమలు చేసి దేశంలోని సీఎం లకి ఆదర్శంగా సీఎం జగన్మోహన్ రెడ్డి నిలిచారని అన్నారు. అనంతరం 49 కేజీల కేక్ ను కట్ చేశారు. ఉన్నత పాఠశాలలోని విద్యార్థిని విద్యార్థులకు కేకు,మిఠాయిలను,పండ్లను పంపిణీ చేశారు. అనంతరం స్థానిక పి.హెచ్.సి కేంద్రంలో విజయ బ్లడ్ బ్యాంక్ వారికి 30 మంది వైసీపీ నాయకులు రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.