ఘనంగా జాతీయ గణిత దినోత్సవం.

ఘనంగా జాతీయ గణిత దినోత్సవం.

వలేటివారిపాలెం.డిశంబరు 22 న్యూస్ మేట్ :  మండలంలోని పోకూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఘనంగా జాతీయ గణిత దినోత్సవం ఘనంగా నిర్వహించారు. మండలంలోని పోకూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారం గణిత ఉపాధ్యాయులు యస్ రవి చంద్ర బాబు,యస్ వి యల్ నరసింహారావు ల ఆధ్వర్యంలో ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి పద్మజ అధ్యక్షతన జాతీయ గణిత దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డిప్యూటీ డీఈవో వెంకటేశ్వర్లు, డి సి ఈ బి సెక్రెటరీ డి. వెంకారెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా పాఠశాలలో జరిగిన వ్యాసరచన, వకృత్వ, సాంస్కృతిక కార్యక్రమాలలో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతులను డిప్యూటీ డీఈవో వెంకటేశ్వర్లు, డి సి ఈ బి సెక్రటరీ వెంకారెడ్డి, హెచ్ఎం పద్మజ చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. అనంతరం పాఠశాలలో జరిగే మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి కూరను రుచి చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు బోధనేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

Spread the love
Ad Widget

Recommended For You

About the Author: Newsmate

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *