భూ రీ సర్వే తో రైతులకు మేలు..తహసిల్దార్ ముజఫర్ రెహమాన్.
వలేటివారిపాలెం డిశంబరు 22 న్యూస్ మేట్ : వలేటివారిపాలెం. భూ రీ సర్వే తో రైతులకు మేలు చేకూరుతుందని తహసిల్దార్ ముజఫర్ రెహమాన్ అన్నారు. మండలంలోని నేకునాంపురం గ్రామంలో మీ భూమి మా హామీ కార్యక్రమం మంగళవారం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మీ భూమి మా హామీతో భూమికి రక్షణ తో పాటు శాశ్వత భూ హక్కు కల్పించడం జరుగుతుందని అన్నారు. భూ రీ సర్వే గతంలో ఎప్పుడో జరిగిందని ప్రస్తుతం సీఎం జగన్ మోహన్ రెడ్డి భూ రీ సర్వే కు ఆదేశించారని అన్నారు. ఈ రీ సర్వే తో ఎవరి భూమి ఎంత, హద్దులు ఏర్పడతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు కంచర్ల వేణు, తోకల నరసింగరావు, కోటయ్య, గోవిందు, నరసయ్య, రామారావు, గ్రామ రైతులు పాల్గొన్నారు.