వైయస్ విగ్రహానికి పాలాభిషేకం

వైయస్ విగ్రహానికి పాలాభిషేకం
కనిగిరి డిసెంబర్ 22 (న్యూస్ మేట్) :  22/12/20ఈనెల 25 న రాష్ట్ర వ్యాప్తంగా పేద ప్రజలకు 27 లక్షల 60 వేల ఇళ్ల పట్టాలు ఇవ్వనున్న సందర్భంగా చెక్ పోస్ట్ వద్ద ఉన్న దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి వైసీపీ నాయకులు పాలాభిషేకం చేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రంగనాయకులు రెడ్డి మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి 25 న రాష్ట్రవ్యాప్తంగా ఇవ్వనున్న 27 లక్షల 60 వేల ఇళ్ల పట్టాలు మరియు 15 లక్షల పక్కా ఇళ్ల నిర్మాణానికి మంజూరు చేయడం దేశ చరిత్రలోనే మొదటిసారి అన్నారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి అడుగుజాడల్లోనే జగన్మోహన్రెడ్డి నడుస్తున్నారని తండ్రిలాగే తనయుడికి పేద ప్రజలంటే ఇష్టమన్నారు. పేద ప్రజల అభ్యున్నతి వైయస్సార్ ప్రభుత్వ లక్ష్యం అన్నారు. ఈ కార్యక్రమంలో షేక్ అబ్దుల్ గఫార్. మరదల కస్తూరి రెడ్డి. మోహన్ రెడ్డి. డాక్టర్ పెరుగు మురళీకృష్ణ. దేవకి రాజీవ్. అరుణో దర్. పెన్న ఏడుకొండలు. మరియు నాయకులు అభిమానులు పాల్గొన్నారు.

Spread the love
Ad Widget

Recommended For You

About the Author: Newsmate

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *