రామాయపట్నం తీరప్రాంత రైతులకు కు మేమున్నాం అంటూ భరోసా ఇచ్చిన శాసనసభ్యులు మానుగుంట మహేందర్ రెడ్డి
గుడ్లూరు డిసెంబర్ 22 న్యూస్ మేట్ : రామాయపట్నం పోర్టు నిర్మాణంతో భూములు ఇళ్లు కోల్పోయిన రైతులు గ్రామస్తుల కోరికమేరకు వారికి అన్ని విధాల అనువైన ప్రదేశంలో పునరావాసం కల్పిస్తామని జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ పేర్కొన్నారు. గుడ్లూరు మండల పరిధిలో రామాయపట్నం దొర తోట చర్చి ప్రాంగణంలో రైతులు గ్రామస్తులతో పోర్టు నిర్మాణ సమీక్ష సమావేశం మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా గా ఏర్పాటు చేసిన సభలో కలెక్టర్ మాట్లాడుతూ రామాయపట్నం పోర్టు నిర్మాణంలో రైతులు అపోహలకు గురి కావాల్సిన అవసరం లేదని పోర్టు ప్రధానంగా కావాల్సిన సాలిపేట రావూరు కర్లపాలెం వారి పాలెం మొండి వారి పాలెం గ్రామాలకు అనుబంధంగా ఉన్న భూములను సానుకూలంగా ఉండటం వలన రైతుల భూములను సమగ్ర సర్వే చేయించి భూమి నష్టపోతున్న ప్రతి రైతుకు లాభం చేకూర్చే విధంగా చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ రైతులకు హామి ఇచ్చారు. అలాగే ఇల్లు నష్టపోతున్న వారికి 5 సెంట్లు స్థలంలో నిర్మించి పునరావాసం కల్పించడమే గాక గుడులు బడులు సిసి రోడ్లు అంగన్ వాడి కేంద్రాలు కమ్యూనిటీ హాల్ మరియు సచివాలయాల కేంద్రాల తోపాటు త్రాగునీటి అవసరాలు కూడా కల్పించి మరియు మత్స్యకారులకు వేట కు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వారు కోరిన తీరప్రాంతం వసతులు కల్పిస్తామని భరోసా కల్పించినట్లు తెలియజేశారు. పోర్టుతో భూముల నష్టపోతున్న రైతుల తాలూకా కుటుంబంలో చదువుకున్న వారికి 70 శాతం మేర స్థానికంగా ఉంటే వారికి ఉద్యోగంలో మొదటి ప్రాధాన్యత కల్పిస్తామని గ్రామ సభలో గ్రామస్తులకు తెలిపారు. అనంతరం కర్లపాలెం మందు వారి పాలెం వారి పాలెం మూర్తి పేట గ్రామాలకు చెందిన రైతులు చాపల మీరయ్య చాపల రమణయ్య ఆవుల శీను అలహరి సుధాకర్ రావు ప్రళయకావేరి పోలయ్య బాలాజీ తాము ఎదుర్కోబోయే సమస్యలను కలెక్టర్కు వివరించారు . కందుకూరు శాసనసభ్యులు మానుగుంట మహేందర్ రెడ్డి మాట్లాడుతూ రామాయపట్నం పోర్టు నిర్మించడంతో వెనుకబడిన జిల్లా అభివృద్ధి శరవేగంతో ముందుకు సాగుతోందని రాష్ట్ర ముఖ్యమంత్రి పాదయాత్ర సమయంలో జిల్లాకు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారని హర్షం వ్యక్తం చేశారు .ఈ నిర్మాణం తో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగవని వారికి తగు ప్రత్యామ్నాయం చూపించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుందని చెప్పారు. అలాగే నిరుద్యోగ యువకులకు ఉద్యోగ అవకాశం కల్పించడంతోపాటు సన్న చిన్న కారు రైతులకు కూడా లబ్ధి చేకూరే పరిస్థితి ఉందని గ్రామస్తులకు హామీ ఇచ్చారు.