ముఖ్యమంత్రి పుట్టినరోజు సందర్భంగా దుప్పట్ల పంపిణీ బేస్తవారిపేట డిసెంబర్ 22 న్యూస్ మేట్ : రాష్ట్ర ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా బేస్తవారిపేట లో సరస్వతి స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో పేదలకు సాధువులకు దుప్పట్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా సరస్వతి సేవా సంస్థ అధ్యక్షులు తిరుపతి వినోద్ కుమార్ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రిగా అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ప్రజల కష్టసుఖాలు తీరుస్తున్నారని అన్నారు. జగన్మోహన్ రెడ్డి తన తండ్రి బాటలో నడుస్తూ రాష్ట్రంలోని ప్రజలందరికీ సుఖ సంతోషాలు అందిస్తున్నారని ఆయన అన్నారు. స్థానిక ఏసుప్రభు నామ ధ్యాన మందిరం ఆవరణలో 50 మందికి దుప్పట్లు భోజనాలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో కొండ రఘునాథరెడ్డి శర్మ పూర్ణచంద్రుడు జగదీశ్ వెంకటేశ్వర్లు సునీల్ తదితరులు పాల్గొన్నారు.