శ్రీ రామ సాయి సేవా బృందం ఆధ్వర్యంలో పేదలకు ఆహారం పంపిణీ
కందుకూరు డిసెంబర్ 25 న్యూస్ మేట్:- ముక్కోటి ఏకాదశి పురస్కరించుకొని శ్రీరామ సాయి సేవా బృందం కందుకూరు వారి అన్నదాత సుఖీభవ కార్యక్రమం లో భాగంగా పట్టణంలోని వీధుల వెంబట ఉన్న నిరుపేదలకు అల్పాహారం, భోజనం ప్యాకెట్లను పంపిణీ చేశారు. ఈసందర్భంగా వాసవి సేవా దళ్ జిల్లా ప్రధాన కార్యదర్శి చక్కా వెంకట కేశవ రావు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆనందంగా పండుగను జరుపుకోవాలని కోరుకుంటూ పట్టణంలోని వీధుల వెంట భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తున్న నిరుపేదలకు ఆహారాన్ని అందించడం చాలా సంతోషంగా ఉందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమానికి శ్రీ కొత్త మాధవరావు, రెలిగేర్ బ్రోకింగ్ లిమిటెడ్ (షేర్స్ ఆఫీస్), కందుకూరు, పు వ్వాడి వెంకటేశ్వర్లు ఫ్యామిలీ కందుకూరు . వెన్నపూస నరశింహారెడ్డి ఫ్యామిలీ హైదరాబాదు, కొచర్ల ప్రసాద్ ఫ్యామిలీ హైదరాబాదు, రవ్వా శ్రీనివాసులు సహకరించినందుకు వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో శ్రీ రామాసాయి సేవాసమితి అధ్యక్షులు రవ్వా శ్రీనివాసులు,న్యాయవాది సాంబశివరావు, ఇన్నమూరి శ్రీనివాసులు,పి.వి.సురేష్ , ఇస్కాల మధు ,పి.వి.గౌతమ్ శివతేజ, పి.మల్లికార్జున,చక్కా చైతన్య గుప్తా, తదితరులు పాల్గొన్నారు.