సునీతకు న్యాయం జరిగే వరకు మహిళా సమైక్య పోరాటం ఆగదు – ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్. రావమ్మ

సునీతకు న్యాయం జరిగే వరకు మహిళా సమైక్య పోరాటం ఆగదు – ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్. రావమ్మ

కందుకూరు డిసెంబర్ 25 న్యూస్ మేట్ :- 25/12/20వలేటివారిపాలెం మండలం బడే వారి పాలెం గ్రామం లోని లింగాబత్తిన సునీత ను అదే గ్రామానికి చెందిన తుల్లూరి కిరణ్ ప్రేమించి మోసం చేయడాన్ని ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య తరఫున తీవ్రంగా ఖండిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్. రావమ్మ అన్నారు. స్థానిక కోటారెడ్డీ భవన్ లో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ నన్ను ప్రేమించి మోసం చేశాడని నాకు న్యాయం చేయండి అంటూ సునీత పోలీస్ స్టేషన్ కి వెళ్ళిన ఎటువంటి న్యాయం జరగక పోవటం చాలా బాధాకరమని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళల ను కాపాడతామని వారి రక్షణకు మేము తోడుంటామని అనేక చట్టాలను తీసుకు వస్తున్న ప్రభుత్వం ఆచరణలో మాత్రం మహిళకు అన్యాయం చేస్తున్నారని వారు మండిపడ్డారు.నాకు అన్యాయం జరిగిందని ఒక మహిళ రోడ్డుపై ధర్నాలు చేస్తే ఇప్పటివరకు నిందితుడిని పై చర్యలు తీసుకోవడంలో ఎవరితో ఎవరికి లాలూచి ఉందని అనుమానాన్ని వ్యక్తం చేశారు. మోసం చేసిన వ్యక్తి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సచివాలయ ఉద్యోగి కావటం అతనికి వరం అయిందని వారు పేర్కొన్నారు. చట్టాలను కాపాడాల్సిన పోలీసులు ఎవరికో భయపడి భాద్యతా రాహిత్యంగా వ్యవహరించడం సరైనది కాదని వారు పేర్కొన్నారు. సునీత కు న్యాయం జరిగేంతవరకు అంద్రప్రదేశ్ మహిళా సమాఖ్య ఎంతవరకైనా వెళ్ళడానికి సిద్ధంగా ఉందని వారు హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు ఎం విజయ , సోషల్ సర్వీస్ మహిళా కార్యకర్త భ్రమరాంబ , ప్రసన్న , కామేశ్వరి , గోవిందమ్మ , ఆంద్రప్రదేశ్ మహిళా సమాఖ్య కందుకూరు కన్వీనర్ టి.మాధవి తదితరులు పాల్గొన్నారు.

Spread the love
Ad Widget

Recommended For You

About the Author: Newsmate

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *