వేణుగోపాలస్వామి ఆలయంలో భక్తిశ్రద్ధలతో ముక్కోటి ఏకాదశి వేడుకలు

వేణుగోపాలస్వామి ఆలయంలో భక్తిశ్రద్ధలతో ముక్కోటి ఏకాదశి వేడుకలు

25/12/20

పామూరు డిసెంబర్ 25 న్యూస్ మేట్ :  ముక్కోటి ఏకాదశి వేడుకలను శుక్రవారం భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు . ఈ సందర్భంగా పలు ఆలయాలలో ఏర్పాటు చేసిన ఉత్తరద్వార దర్శనార్ధం భక్తులు వేకువజామున 4 గంటల నుండే అలయాలకు పెద్దసంఖ్యలో తరలివచ్చారు . ఏకాదశి పర్వదినం సందర్భంగా పట్టణంలోని శ్రీ మదన వేణుగోపాలస్వామి , వరదరాజస్వామి , వల్లీనమేత భుజంగేశ్వరస్వామి , రమాసమేత సత్యనారాయణస్వామి , అయ్యప్ప , సాయిబాబా , శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరీదేవి , మహాలక్ష్మమ్మ దేవాస్థానాలతోపాటు మండలంలోని పలుదేవాలయాలలో ఆలయ అర్చకులు అభిషేకాలు , కుంకుమపూజలతోపాటు , ప్రత్యేక పూజలు నిర్వహించారు . ఈ సందర్భంగా ఆలయాలను ప్రత్యేక విద్యుద్దీపాలంకరణతో శోభాయమానంగా తీర్చిదిద్దారు . భక్తులకు దేవస్థానాల కమిటీల అద్వర్యంలో తీర్థ ప్రసాదాలు అందజేశారు . అనంతరం దేవతా ఉత్సవమూర్తులకు మేళతాళాలు , మంగళవాయిద్యాల నడుమ వైభవంగా గ్రామోత్సవం నిర్వహించగా కార్యక్రమంలో దేవస్థాన చైర్మన్ కనమర్లపూడి బాలగురునాథం , నారాయణం సత్యబాబు , గోపాలాచార్యులు , భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు .

Spread the love
Ad Widget

Recommended For You

About the Author: Newsmate

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *